తిరుమలలో అంతా తప్పు తప్పుగా జరుగుతోంది- జోక్యం చేసుకోండి: కేంద్రం, సుప్రీంకోర్టుకు తాజా లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ చేసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..చేసిన ఆరోపణలు మలుపు తిరుగుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు నాయకులు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ విమర్శలను తిప్పికొట్టారు.

ఈ వివాదంపై తాజాగా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఇప్పుడు ఏకంగా సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. పరకామణి నిధుల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు.

Seeking Justice CBI Enquiry Requested for Parakamani Controversy at TT Devasthanams

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 కోట్ల హిందువులకు మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమలపై టీడీపీ కూటమి ప్రభుత్వం లేని పోని గందరగోళాన్ని, అపోహలను సృష్టిస్తోందని గురుమూర్తి పేర్కొన్నారు. భక్తికి ప్రతీకగా భావించే తిరుమల, పవిత్ర హిందూ ధర్మాన్ని రాజకీయం చేయడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా అది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ఆలయాలను పరిరక్షించడం, సామరస్యాన్ని కాపాడటం మన రాజ్యాంగం మనకు అప్పగించిన బాధ్యతగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయని గురుమూర్తి ఈ లేఖలో వివరించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగే సీబీఐ విచారణ మాత్రమే నిజానిజాలను బయటపెట్టి, నిరాధారమైన ఆరోపణలకు ముగింపు పలకగలదని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడం మనందరి సమిష్టి కర్తవ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు చేస్తోన్న ఆరోపణలన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని, దీనికోసం కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా విచక్షణారహితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇలా వినియోగించుకుంటోందని, అవినీతి ముద్ర వేస్తోందని, ప్రజల భక్తి- విశ్వాసాలను ఉద్దేశపూరకంగా దెబ్బతీస్తోందని గురుమూర్తి చెప్పారు. భక్తిప్రపత్తులతో స్వామివారికి సమర్పించే విరాళాలు, పరకామణి వ్యవస్థను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+