డిగ్గీపై సీమాంధ్ర కాంగ్ అలక: వేరు దారిలో మరికొందరు

 Seemandhra Congress leaders angry at Diggy
హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. తమ ప్రాంత ప్రజల సెంటిమెంటును పరిగణలోకి తీసుకోకుండానే విభజనపై దూకుడుగా వెళ్తున్న అధిష్టానం కనీసం.. తమ చిన్న చిన్న కోరికలను కూడా తీర్చకపోవడంపై వారు అసంతృప్తితో ఉన్నారు.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం, భద్రాచలంను సీమాంధ్రలో కలపటం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న డిగ్గీని కలిసేందుకు కూడా వారు ఆసక్తి చూపడం లేదు. మెజార్టీ నేతలు డిగ్గీని గురువారం కలుసుకోలేదు.

సీమాంధ్రుల డిమాండ్లు అన్ని కాకపోయినా కొన్నింటిని పరిగణలోకి తీసుకున్నా తాము ప్రజల్లోకి వెళ్లి సర్ది చెప్పుకునే అవకాశం ఉండేదని కానీ, తమకు అధిష్టానం ఆ అవకాశం ఇవ్వలేదని వాపోతున్నారు. తాము ఇప్పటికే చెప్పేదంతా చెప్పామని, కొత్తగా డిగ్గీకి చెప్పేదేమీ లేదని, ఆయనను కలువబోమని శైలజానాథ్ చెప్పారు. అయితే ఆయన నుండి పిలుపు వస్తే మాత్రం వెళ్తామన్నారు.

మరోవైపు అధిష్టానానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న ప్రజాప్రతినిధులు మాత్రం దిగ్విజయ్‌ని కలిశారు. మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, డొక్కా మాణిక్యవర ప్రసాద్, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి తదితరులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+