జగన్‌కు అవైనా ఉన్నాయి కానీ: కిరణ్‌పై కొండ్రు హెచ్చరిక

Seemandhra Congress leaders target Kiran
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి రూ.25 కోట్లు పెట్టి ఓ ఛానల్ ఏర్పాటు చేసుకొని, ఆ చానళ్లో తమపై వ్యక్తిగత దూషణలు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి కొండ్రు మురళి మండిపడ్డారు. మీ ఇష్టం.. వ్యక్తిగతంగా వెళ్తే తాము కూడా చాలా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్‌కు నాయకత్వ లక్షణాలైనా ఉన్నాయని, కిరణ్‌కు అవీ లేవన్నారు. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్న కిరణ్ పైన కాంగ్రెసు నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ సీమాంధ్ర ప్రజలను మోసం చేయడం కళ్లారా చూశామని, కొంతమందిని ఉసిగొల్పి సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సినవి అడగనీయకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీడియాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, బొత్స సత్యనారాయణ, బాలరాజు, రఘువీరా రెడ్డిలతో పాటు తనను ఆయన మీడియా ద్వారా విమర్శిస్తున్నారు.

ఒక్క టి ఖర్చు కూడా లేకుండా సోనియా తనను సిఎంను చేసిందని ఎన్నోసార్లు చెప్పుకున్న కిరణ్ ఇప్పుడు కాంగ్రెస్‌నే దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను దుష్ప్రచారం చేస్తున్న ఛానల్ చైర్మన్ ఎవరో తెలుసని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అన్ని విషయాలు మా ట్లాడాల్సి వస్తుందన్నారు. కిరణ్‌తోనైనా, జగన్‌తోనైనా వారు కాంగ్రెస్‌లో ఉన్నంతవరకే క్లోజ్‌గా ఉన్నామని, కాంగ్రెస్‌ను వీడిన తర్వాత దూరమయ్యానన్నారు.

కిరణ్‌కు, జగన్‌కు పెద్ద తేడాలేదన్నారు. వ్యక్తిగతంగా తమ జోలికి రావొద్దని కిరణ్‌ను, ఆయన తమ్ముడిని హెచ్చరించారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి తెలంగాణ ఇచ్చారని ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, పదేళ్లలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎప్పుడు కావాలన్నా ప్రధాని అయ్యే అవకాశముందన్నారు. వందేళ్లు కాంగ్రెస్ ను రానీయకూడదని మాట్లాడుతున్న జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ఒక లక్ష ఇచ్చేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+