టి: ఆనం ఇంట్లో చిరంజీవి, వేరుగా గంటా సమాలోచన

సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో తాజా పరిస్థితులు, పార్టీలో విభజన, సమైక్యవాదం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి వర్గం నేతగా ముద్రపడిన మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, మంత్రి సాకె శైలజానాథ్‌లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ పైన వారు చర్చిస్తున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిత్యం తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో సమైక్యవాదులు కాంగ్రెసు పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి పైన విరుచుకుపడుతున్నారు. వారి ఇళ్ల ముందు నిత్యం నిరసనలు తెలియజేస్తున్నారు.
ఆనం నివాసంలో, గంటా నివాసంలో వేర్వేరుగా భేటీ కావడం గమనార్హం. సోమవారం సాయంత్రం మంత్రి సి రామచంద్రయ్య నివాసంలోను పలువురు నేతలు, మంత్రులు సమావేశమయ్యారు. మరోవైపు సీమాంధ్రలో కాంగ్రెసు నేతలకు విభజన సెగ తగులుతోంది.












Click it and Unblock the Notifications