అడిగిందేంటి..ఇచ్చిందేంటి: టిడిపి, చీఫ్‌జస్టిస్‌కి శ్రవణ్ లేఖ

అతి ప్రధానమైన ఆస్తులు, అప్పుల అంశంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. వీటిపై పారదర్శకత లేకుంటే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్నారు. ఉద్యోగుల వివరాలను ఇవ్వలేకపోయారన్నారు. 55 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు పైన ప్రత్యేక ప్రకటన చేయాలన్నారు. కృష్ణా, గోదవరి బేసిన్‌లో నీటి పైన స్పష్టత లేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పంపిణీ పైన సమాచారం లేదన్నారు.
బిల్లును వ్యతిరేకించాలి: వివేకా
ఆరు నెలల ముందు సమైక్య ఉద్యమాన్ని ప్రారంభించి వుంటే తెలంగాణ బిల్లు వచ్చేది కాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిలాంటి నేతలు పదవుల కోసం విభజన కోరుకుంటున్నారని ఆరోపించారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తెరాస నేత శ్రవణ్ లేఖ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రవణ్ కుమార్ బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అశోక్ బాబును ఉద్యోగం నుండి తొలగించాలని కోరారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అశోక్ బాబుకు సిఎస్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications