సీమాంధ్ర వాహనాలకు టిలో రిజిస్ట్రేషన్!, రెన్యూవల్‌కూ
హైదరాబాద్: సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో పదమూడు జిల్లాలలో కొత్తగా వాహనాలు కొన్న వారికి తెలంగాణ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారు. సీమాంఎధ్రలో వాహనాలను కొనుగోలు చేసినా తెలంగాణలోని ఏదో ఒక జిల్లాలో ఇంటి చిరునామా ఆధారాన్ని చూపించగలిగితే చాలట. యాభై రోజులుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం కొనసాగుతోంది.
సీమాంధ్రలో రవాణా ఉద్యోగులు విధులుకు హాజరుకాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ఏ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేస్తే వాహనానికి ఆ జిల్లా నెంబరే కేటాయించనున్నారు. సీమాంధ్ర ప్రాంత వాహనాలకు హైదరాబాద్ నగర పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు.

సీమాంధ్ర వాహనదారుల లైసెన్సుల రెన్యూవల్‌ను తెలంగాణ జిల్లాల్లో చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో అనుమతించే అవకాశముంది. సీమాంధ్ర జిల్లాల్లోని లారీలు, బస్సులు తెలంగాణ జిల్లాకు తీసుకు వచ్చి ఫిట్ నెస్ ధృవపత్రం పొందవచ్చు.
ఈ వెసులుబాటు తర్వాత సీమాంధ్రకు చెందిన చాలామంది హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications