‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’: ఇది పవన్ పెట్టిన పేరు, 9న

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం సెప్టెంబర్ 9న కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' అని నామకరణం చేశారు.

ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత ఆదివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించనున్నారు.

Seemandhrula Atma Gaurava Sabha on Sept 9

ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా, కాకినాడ సభలో ప్రత్యేక హోదా విషయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. తన రాజకీయ ప్రణాళికలపై కూడా ఈ సభలో కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+