Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోము వీర్రాజు గట్స్: మోదీ ముందే చంద్రబాబుకు ఇచ్చిపడేశాడు

PM Modi Rajahmundry meeting: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనత పార్టీ కూటమి ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేసింది. కూటమి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బరిలో దించింది.

Senior BJP senior leader Somu Veerraju criticized Chandrababu Naidu in presence of PM Modi

సోమవారం సాయంత్రం రాజమండ్రిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. బీజేపీ పోటీ చేస్తోన్న లోక్‌సభ స్థానం ఇది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ బరిలో నిలిచారు. ఆమెపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్‌ను నిలిపింది.

పురంధేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ సభలో ఒకే వేదికపై కనిపించారు. కర్నూలు జిల్లాలో రోడ్ షో నిర్వహించాల్సి ఉన్న కారణంగా టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ సభకు హాజరు కాలేదు.

కాగా- ఈ సభలో బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఏకంగా ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ సొంత కూటమికి చెందిన నాయకుడే అయినప్పటికీ- చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు సోము వీర్రాజు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన ద్వంద్వ విధాలను సోము వీర్రాజు.. మోదీ సమక్షంలోనే ఎండగట్టారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు వద్దన్నాడో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సభలు పెడుతున్నాడని, ఎవ్వరైనా సరే వెళ్లి ప్రశ్నిస్తోన్నారా? అంటూ నిలదీశారు.

Senior BJP senior leader Somu Veerraju criticized Chandrababu Naidu in presence of PM Modi

చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా వద్దన్నాడంటూ ఎందుకు చంద్రబాబును నిలదీయట్లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రతి దానికీ బీజేపీనే ఎందుకు సమాధానాలు, వివరణలను ఇచ్చుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని ప్రశ్నించడం కాదని, దాన్ని ఎందుకు వద్దాన్నాడో చంద్రబాబును అడగాలని సూచించారు సోము.

ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు గానీ, టీడీపీ గానీ బీజేపీ అవసరం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మా (బీజేపీ) సహకారంతో అధికారంలోకి వచ్చేది మీరే (చంద్రబాబు).. మళ్లీ మమ్మల్ని విమర్శించేదీ మీరే అంటూ నిప్పులు చెరిగారు. నోటాతో బీజేపీ పోటీ పడుతోందంటూ టీడీపీ నాయకులు చాలాసార్లు తమను విమర్శించారని, ఇప్పుడు మళ్లీ బీజేపీతోనే అవసరం వచ్చిందని గుర్తు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+