ఐఏఎస్ దుర్మార్గం, వివాహేతర సంబంధం - ఆ మహిళ మృతి, ఆ తరువాత..!!
ఓ సీనియర్ ఐఏఎస్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఆ ఐఏఎస్ ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. నిత్యం అనుమానాలు.. గొడవలు ఘర్షణగా మారాయి. ఆ సమయంలోనే ఆ మహిళ పైన దాడి చేసినట్లుగా చెబుతున్నారు. తలకు గాయంతో ఆమె మరణించినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. అయినా, కేసు లేకుండా మేనేజ్ చేసిన ఆ ఐఏఎస్ ఏమీ ఎరగనట్లుగా తన విధుల్లో తాను బిజీ అయిపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.
ఏపీ కేడర్ కు ఓ టాప్ ఐఏఎస్ వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో కూడా పని చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన శాఖకు ఆయన అధిపతిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆ అధికారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి. 50 ఏళ్లపైగా వయసు ఉన్నఆ ఐఏఎస్ అధికారి సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ... హైదరాబాద్‌లో మరో మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారాంతాలు.. సెలవు రోజుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే మకాం వేసేవారు. చాలా కాలం ఈ వ్యవహారం గుట్టుగానే సాగింది. కాగా, ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన సమస్యలకు చికిత్స తీసుకున్నారు.

కాగా, తనకు ఆరోగ్యం బాగలేని సమయంలో ఆ మహిళ తనను కాదని, మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ఆయనకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఘర్షణగా మారింది. దీంతో.. తాజాగా ఆ మహిళతో ఐఏఎస్ మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో కోపం తట్టుకోలేక ఆ మహిళను బలంగా కొట్టినట్లు కధనాలు వెలువడ్డాయి. తల గోడకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని.సమీపంలోనే ఉన్న ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే...ఆమె మరణించినట్లు కథనాల్లో పేర్కొన్నారు. అయితే, ఆ అధికారి ఎక్కడా ఆమె మృతికి అసలు కారణం చెప్పకుండా... ప్రమాదవశాత్తూ కిందపడటం వల్ల తగిలిన గాయం (ఫాలెన్ డౌన్) అని ఆస్పత్రి రికార్డుల్లో రాయించినట్లు తెలుస్తోంది. అసలు విషయం బయటికి రాకుండా, పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. అక్కడేమీ జరగనట్లుగా విజయవాడ వచ్చేసి... తన పని తన విధుల్లో తాను చేరిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు మీడియా ద్వారా బయటకు రావటంతో అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications