మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం - ఏపీ కేంద్రంగా..!?
తెలంగాణ మాజీ సీఎస్..సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ మాజీ సీఎస్..సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన సోమేశ్ ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేసారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా సీఎస్ జవహర్ రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆయన సీనియార్టీకి తగిన పోస్టు ఇచ్చే దిశగా కసరత్తు జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వ లేదు. సోమేశ్ కు ఏపీలో ఏ పోస్టు దక్కుతుందా అనే ఆసక్తి రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లోనూ కనిపించింది. తనకు ఏ పోస్టు ఇచ్చినా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు స్వీకరిస్తానని సోమేశ్ స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల అధికా వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.

ఏపీలో రిపోర్టు చేసినా..
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్ కు ఎలాట్ అయిన సోమేశ్ కుమార్ తరువాతి కాలంలో క్యాట్ ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగారు. దీని పైన కేంద్రం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. 2017లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో..ఆ సమయంలో సీఎస్ గా ఉన్న సోమేశ్ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యారు. ఆ తరువాత ఏపీకి వెళ్లి అక్కడ ప్రభుత్వానికి రిపోర్టు చేసారు. కానీ, సోమేశ్ తెలంగాణలో సీఎస్ హోదాలో పని చేసి ఏపీలో ఏ స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందనే దాని పైన అప్పట్లో చర్చ సాగింది. సోమేశ్ సీనియార్టీకి తగిన పోస్టులు ఏపీలో ఖాళీ లేవు.

దక్కని పోస్టింగ్.. కీలక నిర్ణయం
ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ సీనియర్లతో కొద్ది కాలం క్రితమే మార్పులు చేసారు. సీఎస్ హోదాలో పని చేసిన అధికారి సోమేశ్ కు అంత కంటే తక్కువ స్థాయి పోస్టు ఇవ్వటం పైన ఏపీ ప్రభుత్వం చర్చలు చేసింది. కానీ, ఇప్పటి వరకు ఏ పోస్టింగ్ ఖరారు చేయలేదు. ఇదే సమయంలో సోమేశ్ సైతం స్వచ్చంద పదవీ విరమణ చేయటం మేలనే ఆలోచనకు వచ్చినట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. కానీ, ఆ సమయంలో సోమేశ్ ఆ వాదనను ఖండించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసానని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా సోమేశ్ అదే నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఎస్ కు ఏపీ ప్రభుత్వం నుంచే దరఖాస్తు చేసారు. 2023 డిసెంబర్ చివరి వరకు ఆయనకు సర్వీసు ఉంది.

వీఆర్ఎస్ కు సోమేశ్ దరఖాస్తు
సీఎస్ గా చేసిన సోమేశ్ ను కేంద్రం అధికారికంగా స్వచ్చంద పదవీ విరమణకు ఆమోదిస్తే..సోమేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకొనే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తెలంగాణలో సీఎస్ హోదాలో పని చేసి పదవీ విరమణ చేసిన వారికి సీఎం కేసీఆర్ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్ విస్తరణ వేళ.. సోమేశ్ లాంటి సీనియర్ అధికారి సేవలు కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో...ఇప్పుడు సోమేశ్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసారు. సర్వీసులో ఉన్న సమయంలోనే వీఆర్ఎస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో.. ఏపీలో రిపోర్టు చేసిన తరువాత ఇప్పుడు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసారు. ఆయనకు అధికారంగా ఆమోదం లభిస్తే.. ఇక సోమేశ్ కీలక పదవిలో నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications