గోదావరి జిల్లాల్లో పవన్‌కు బిగ్ షాక్: వైసీపీలో చేరిన కీలక నేత- జగన్ సమక్షంలో
కాకినాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర.. పెద్దగా కలిసి రానట్టే కనిపిస్తోంది. వారాహి సభల్లో పవన్ కల్యాణ్ చేస్తోన్న ప్రసంగం.. దారి తప్పిందనే అభిప్రాయాలు సొంత పార్టీ క్యాడర్‌లోనే వ్యక్తమౌతోన్నాయి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని, అది వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబించట్లేదనే ప్రచారం ఉంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే అవే జిల్లాలకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా గుడ్‌బై చెప్పడం కలకలం రేపుతోంది. కొద్దిసేపటి కిందటే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.

రాయపురెడ్డి ప్రసాద్ సొంత నియోజకవర్గం- తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారాయన. మూడో స్థానంలో నిలిచారు. 11.79 శాతంతో 20 వేలకు పైగా ఓట్లను సాధించగలిగారు. జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)..!#YSJagan #CMYSJagan #RayapuReddyPrasad #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/mgfVKB16gW
— oneindiatelugu (@oneindiatelugu) August 30, 2023
కొంతకాలంగా ఉమ్మడి గోదావరి జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో రాయపురెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. రాయపురెడ్డి, ఆయన అనుచరులకు వైఎస్ జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వారాహి యాత్ర తరువాత గోదావరి జిల్లాల్లో జనసేన మైలేజీ, ఓట్ల శాతం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నేత గుడ్ బై చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారాహి యాత్ర చేపట్టినా క్షేత్రస్థాయిలో ఓటర్లెవరూ కూడా జనసేన వైపు ఆకర్షితులు కావట్లేదనేది ఈ తాజా పరిణామాలతో స్పష్టమైనట్టయింది.












Click it and Unblock the Notifications