సీనియర్ జర్నలిస్టు కళత్తూరు సుధాకర్ రెడ్డి ఆకస్మిక మృతి

తిరుపతి‌: సీనియర్ జర్నలిస్టు కళత్తూరు సుధాకర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనాడులో సబ్ ఎడిటర్‌గా ఆయన 1986లో తన జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఉదయం దినపత్రికల్లో పనిచేశారు. సైకాలజీలో పిహెచ్‌డి చేసిన సుధాకర్ రెడ్డి పలు కళాశాలలకు డీన్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మరణించేనాటికి ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సి.మల్లవరం)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Senior journalist Kalathhur Sudhakar Reddy passes away

విద్యాసంస్థల్లో పనిచేస్తూ కూడా పాత్రికేయ రంగంపై మమకారంతో ఆయన పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూ వచ్చారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైకాలజిస్ట్స్ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ కౌన్సెలింగ్ సైకాలిజిస్టుల సంఘం రాయలసీమ కోఆర్డినేటర్‌గా, జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు.

ఆయన హఠాన్మరణంపై ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్టుల సంఘాలతో పాటు దినపత్రికల ప్రతినిధులు, ఎపి కౌన్సెలింగ్ సైకాలిజిస్టుల సంఘం నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+