జగన్‌కు షాక్..వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ వైపు..?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి.

Senior YCP leaders are looking to join the Congress

ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఐదేళ్ల పాటు పార్టీలోనే ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా , రాజకీయంగా , ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలామంది నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు మళ్ళీ చేరితే ఎలా ఉంటుందనే దానిపైన అంచనాలు వేసుకుంటున్నారట.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుండడం, ఏపీలో షర్మిల కాంగ్రెస్ తరుఫున యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండటంతో మెజార్టీ నేతలు ఆ పార్టీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారట.

గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ ఉండడంతో , మళ్ళీ వారంతా తమకున్న పరిచయాలతో కాంగ్రెస్ అగ్ర నాయకులతో సంప్రదింపులు చేస్తూ, పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.ఇప్పటికే వైసీపీలోని సీనియర్ నాయకులను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే విధంగా కెవిపి రామచంద్ర రావు తెర వెనుక తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఇప్పటికే అనేక కష్టాల్లో ఉన్న వైసీపీ మరిన్ని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+