వరదలు కదా, వదిలేస్తారు అనుకున్నారు, వైసీపీ లీడర్స్ పరుగో పరుగు, జంప్ జిలాని
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం దెబ్బకు వైసీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసుల అరెస్టు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వెంటాడి వెంటాడి హైదరాబాద్ లో అరెస్టు చేయడంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నాయకుడు దేవినేని అవినాశ్ తదితరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎంపీ జోగి రమేష్, వైసీపీ నాయకులు దేవినేని అవినాశ్, తలశిల రఘురాం, అప్పిరెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కోసం ఆయన ఇంటి దగ్గర గాలించినా ఆయన ఆచూకి చిక్కలేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నందిగం సురేష్ హైదరాబాదులో తలదాచుకున్నాడు అని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ ని మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ విచారిస్తున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసుల అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు కావడంతో మాజీమంత్రి జోగి రమేష్, దేవినేని అవినాశ్ తదితరులు మమ్మల్ని కూడా అరెస్టు చేస్తారు అనే భయంతో వాళ్లు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పోలీసులు విజయవాడ వరద సహాయక చర్యల్లో బిజీబిజీగా ఉన్నారని, మమ్మల్ని వదిలేస్తారులే అనుకున్న వైసీపీ నాయకులకి అదే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నందిగం సురేష్ అరెస్టు కావడంతో మిగిలిన వైసీపీ నాయకులకు దడ మొదలైయ్యింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన కేసులో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ క్లిప్పింగ్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతారో అనే విషయం వేచి చూడాలని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications