కష్టాల్లో జగన్ సన్నిహితుడు: అక్కడ అరెస్ట్..ఇక్కడ రిలీఫ్: రంగంలోకి వైసీపీ ఎంపీలు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌లు తెర మీదకు వస్తున్నాయి. ప్ర ముఖ పారిశ్రామికవేత్త, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసిన ట్లు ధృవీకరించారు. ఏ కేసులో అయితే సెర్బియా పోలీసులు అరెస్ట్ చూపిస్తున్నారో..అదే కేసులో ఇక్కడ ఈడీ అప్పి లేట్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో..ఇక్కడ రిలీప్ వచ్చినా..సెర్బియాలో నిర్బంధానికి గురైన నిమ్మగడ్డను భారత్‌కు తెప్పించేందుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సెర్బియాలో నిమ్మగడ్డ అరెస్ట్..
ప్రముఖ పారిశ్రామిక వేత్త..జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్టు చేసారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన ఆయనను సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్ పోర్టు వ్యవహారానికి సంబంధించి రస్ అల్ ఖైమా (రాక్) దేశంలో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆ మేరకు ఆయనను నిర్బంధించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16,000 కోట్ల విలువైన వాన్‌పిక్ ప్రాజెక్టు వివాదాల్లో చిక్కుకోవటం, ప్రాజెక్టు అమల్లో జాప్యం చోటుచేసుకోవటంపై మొదటి నుంచీ రాకియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రాజెక్టులో 74 శాతం నిమ్మగడ్డకు, 26 శాతం రాకియాకు ఉండేది. అది 2008లో రూ.845 కోట్ల పెట్టుబడి అందించింది. ఆ తర్వాత సీబీఐ కేసులు నమోదు కావటం, అనుకున్నట్లుగా పోర్టు ప్రాజెక్టు అమలు కాకపోవటంతో రాకియా ప్రతినిధులు తమ పెట్టుబడుల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చినా..స్పందన లేదు. దీంతో..సెర్బియాకు వచ్చిన నిమ్మగడ్డను అరెస్ట్ చేసారు.

ఇక్కడ ట్రిబ్యునల్‌లో ఊరట..
వాన్‌పిక్' కేసులో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన ఆయన ఆస్తులను విడుదల చేయాలంటూ ఢిల్లీలోని ఈడీ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. వాన్‌పిక్ కోసం నాటి ప్రభుత్వం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ ప్రభుత్వం 11వేల ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం రస్ అల్‌ఖైమా సుమారు రూ.750 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. మరోవైపు... నిమ్మగడ్డ ప్రసాద్ క్విడ్ ప్రో లో భాగంగా జగన్ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని, వైఎస్సార్ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల మేరకు విరాళాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి. వాన్‌పిక్ భూములతోపాటు నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఈ జప్తు చెల్లదంటూ శుక్రవారం ఈడీ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. వాన్‌పిక్ ప్రాజెక్టును కొనసాగించుకునేందు కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే... నాలుగు వారాల్లోపు రూ.274 కోట్లకు నిమ్మగడ్డ ఇన్‌డెమినిటీ బాండ్ సమర్పించాలని షరతు విధించింది. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ సంస్థల పెట్టుబడులనూ సమర్థించింది.

నిమ్మగడ్డ కోసం వైసీపీ ఎంపీల రాయబారం..
వాన్‌పిక్ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమిరేట్స్ దేశమైన రస్ అల్‌ఖైమా ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (రాకియా) సీఈవో ఫిర్యాదుపై స్పందించిన ఇంటర్‌పోల్ నిమ్మగడ్డపై లుక్‌ఔట్ నోటీసు జారీ చేసి బెల్‌గ్రేడ్‌లో అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయానికి సెర్బియా ప్రభుత్వం సమాచారం అందించింది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమా చారం. ఆయనను విడుదల చేసి భారత్‌కు రప్పించేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్, హోంమంత్రి అమిత్ షాలకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. ఈ వినతిపత్రంపై వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సంత కం చేసినట్లు తెలిసింది. మరోవైపు... బుధవారమే న్యాయవాదుల ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.