గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య జరిగింది. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మహిళను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.మృతులు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలానే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సైతం ఘటనపై రియాక్ట్ అయ్యారు. కూలీ పనులకోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం భాదాకరమన్నారు.













Click it and Unblock the Notifications