వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు సర్కారుకు షాక్: సదావర్తి భూములపై సుప్రీం తీవ్ర హెచ్చరిక

ఏపీలో సంచలనంగా మారిన సదావర్తి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేహర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ.40కోట్లు తేడా ఉండటమేంటని ఆంధ్రప్రద

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: ఏపీలో సంచలనంగా మారిన సదావర్తి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ.40కోట్లు తేడా ఉండటమేంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేగాక, తొలిసారి వేలం పారదర్శకంగా జరిగినట్లు కనిపించడం లేదని అన్నారు.

ట్రస్ట్ ఆస్తులు కాబట్టి తక్కువ ధరకు అమ్మితే కోర్టు కళ్లు మూసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో తమను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

Setback to AP Govt: Supreme Court serious comments on Sadavarti lands

ఆ భూములు సదావర్తి సత్రానివేనని స్పష్టంగా తెలుస్తోందని, అక్కడి జరిగిన ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత తమిళనాడు సర్కారుదేనని స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ.. భూములను వేలంలో దక్కించుకున్న సంస్థ, ఇప్పుడు డబ్బు కట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది.

కాగా, రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి డబ్బులు కట్టే విషయమై శనివారం మధ్యాహ్నం వరకూ గడువుందని గుర్తు చేసింది. నోటీసులు పంపించి తదుపరి ప్రక్రియ కొనసాగించేందుకు సమయం కోరింది. దీంతో కేసు విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ప్రకటించారు.

English summary
Supreme court rejected the petition filed by Tamil Nadu government stating that Andhra Pradesh doesn’t have ownership over the Sadavarti Satram lands on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X