జగన్ ఆశలపై నీళ్లు జల్లుతున్న వాలంటీర్లు-రివార్డులకే స్పందన కరవు-ఎన్నికలకు పనికొస్తారా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అమలుచేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి మార్కెటింగ్ చేసేందుకు నియమించిన వాలంటీర్లలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తమకు ఇస్తున్న ఐదు వేల జీతంపై అసంతృప్తిగా ఉన్న వాలంటీర్లు.. ఇప్పుడు ఏటా ప్రకటిస్తున్న పురస్కారాలపైనా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు చాలా చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పురస్కారాల ప్రదాన కార్యక్రమాలకు డుమ్మా కొట్టేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేల నుంచి సర్కార్ కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది.

జగన్ మానసపుత్రిక
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షేత్రస్ధాయిలో నవరత్నాల అమలు కోసం వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటైంది. వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడటంతో పాటు వచ్చే ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న ఈ వ్యవస్ధ ఏర్పాటు సందర్భంగా విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా జగన్ లెక్క చేయలేదు. సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం వాలంటీర్ల అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు వాలంటీర్ల చేతుల మీదుగా లబ్దిదారులకు అందాయి. దీంతో వాలంటీర్ల వ్యవస్ధకు ఓ ప్రత్యేకత ఏర్పడింది.

వాలంటీర్ల అసంతృప్తి
వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటైనప్పుడు వారికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి అంగీకరించి తాత్కాలిక ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్లు ఆ తర్వాత మాత్రం దీనిపై అసంతృప్తికి గురయ్యారు. ఐదు వేలకు ప్రభుత్వం చెప్పే అన్ని పనులు చేయడం సాధ్యం కాదని గుర్తించారు. దీంతో జీతాలు పెంచాలని రోడ్లపైకి ఎక్కడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం కూడా వారితో చర్చించింది. జీతాలు పెంచడం సాధ్యం కాదని, మీరు చేస్తున్నది సేవ అంటూ జగన్ వారికి నచ్చజెప్పారు. అదే సమయంలో మెరుగైన పనితీరు చూపిస్తే ఏటా వాలంటీర్లకు రివార్డులు, అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అదీ మొత్తం 2.67 లక్షల వాలంటీర్లలో 2.24 లక్షల మంది వరకూ అవార్డులు ఇస్తున్నారు. అంటే దాదాపు 80 శాతం మందికి వీటిని ఇస్తున్నారు. అయినా వీరిలో అసంతృప్తి తగ్గడం లేదు.

పురస్కారాలకు స్పందన కరవు
ఏటా వాలంటీర్లకు పనితీరును బట్టి అందిస్తున్న సేవా పురస్కారాలకు స్పందన కరవవుతోంది. ఈ పురస్కారాల పేరుతో 10 వేల నుంచి 20 వేల వరకూ మొత్తాల్ని ఇస్తున్నారు. వీటిని ఇచ్చేందుకు ఏటా రాష్ట్రస్ధాయిలో ఓ కార్యక్రమంతో పాటు ఎక్కడికక్కడ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని నిర్వహించే బాధ్యతను వైసీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నా ఎంతకీ వాలంటీర్లు రాకపోవడంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది. తాజాగా ఇదే కోవలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఇలాంటి పరిస్ధితి ఎదురైంది. ఆ తర్వాత నిన్న విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్దితి. దీంతో ఎమ్మెల్యేల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జగన్ ఆశలు నెరవేరుస్తారా ?
వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటు ద్వారా రాజకీయంగా భారీఎత్తున లబ్ది పొందేందుకు సీఎం జగన్ స్కెచ్ వేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాలంటీర్ల తీరు చూస్తుంటే జగన్ వీరిపై పెట్టుకున్న నమ్మకం నీరుగారుతోంది. వాలంటీర్ల పురస్కారాలు తీసుకోవడానికే ఆసక్తి చూపని వీరు వచ్చే ఎన్నికల నాటికి తమకు ఏమేరకు ఉపయోగపడతారని ఇప్పటికే ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వీరిని పక్కనబెట్టి తమ పని తాము చూసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications