విజయసాయిరెడ్డి కూతురికి హైకోర్టులో బిగ్ షాక్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు ఆ పార్టీ నేతల్ని, వారితో లబ్దిపొందిన వారిని వెంటాడతున్నాయి. ఇదే క్రమంలో కాబోయే రాజధానిగా వైసీపీ ప్రచారం చేసుకున్న విశాఖలో తాము నిర్మించుకున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేయకుండా స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలోని భీమిలో బీచ్ వద్ద ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన ఓ కాంక్రీట్ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట దక్కలేదు. గతంలో విశాఖ బీచ్ వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయాలని నేరుగా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సింగిల్ బెంచ్ నిరాకరించింది.

సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ మేరకు స్టే ఇవ్వాలని కోరుతూ చేసిన వినతిని హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. దీనిపై కావాలంటే హైకోర్టు సీజే బెంచ్ వద్దే తేల్చుకోవాలని సూచించింది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఈ వ్యవహారాన్ని సీజే బెంచ్ కు రిఫర్ చేసినా తిరిగి ఛీఫ్ జస్టిస్ సింగిల్ బెంచ్ వద్దే తేల్చుకోవాలని సూచించారు. దీంతో సింగిల్ బెంచ్ ఇప్పుడు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు సీజే వద్ద ఇప్పటికే జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్ పై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల సవరణకు నేహారెడ్డి ప్రయత్నించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications