విశాఖ ఎమ్మెల్యే తండ్రి భూమి కబ్జా: ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆవేదన
అమరావతి: విశాఖ శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలు ఎక్కవయ్యాయని, వీటిని నియంత్రించడానికి పటిష్ట వ్వవస్త అవసరమని ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తానూ భూ కబ్జా బాధితుడేనని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తన తండ్రి పెనుమత్స సత్యనారాయణరాజు పేరు మీదన్న ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో సర్వే నెంబర్ 218/27లో 26 సెంట్లు, 218/31లో 12 సెంట్లు కలిపి మొత్తం 38 సెంట్ల వ్యవసాయ భూమిని కాజేసేందుకు గుడ్ల రమణ, అప్పలగురువులు, దల్లి రాంబాబు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు.
ఇంతటితో ఆగకుండా తమపైనే దౌర్జన్యం చేయబోయారని ఆయన ఆరోపించారు. వీరిపై పోలీస్ కమిషనర్, కలెక్టర్‌లకు వెంటనే ఫిర్యాదు చేయడంతో భూ కజ్జా సమస్య సద్దుమణిగిందన్నారు. ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు రౌడీల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని బీజేపీ శాసన సభా పక్ష నేతగా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ రికార్డులను పరిరక్షించడానికి పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసి తహశీల్దార్ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
అలా కాకుండా దిగువ సిబ్బందికి అనధికారిక రికార్డులను అప్పగించడం వల్ల సామాన్య ప్రజల భూమి కబ్జాదారుల చేతికి వెళుతోందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భూ కజ్జాకు సంబంధించిన ఏడుగురు నిందితులను విశాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications