ఏడవ తరగతి అమ్మాయికి బ్లూఫిలిమ్స్ చూపించి..: అవమానంగా భావించి ఆత్మహత్య

హైదరాబాద్: మేకలు కాచేందుకు వెళ్లిన విద్యార్థినిని ఒక యువకుడు శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆమె కిరోసిన్ పోసుకొని కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

జిల్లాలోని ధర్మసాగర్ మండలం సోడషపల్లి గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల ప్రతిభ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తమ మేకలను తోలుకొని వెళ్లింది. అదే సమయంలో గ్రామం చివరన ఉన్న ఒక ఇంట్లో ఆమెను సదానందం అనే వ్యక్తి మాయమాటలు చెప్పి శారీరకంగా, మానసికంగా వేధించాడు. అంతేకాదు, ఆమెకు బ్లూఫిలిమ్స్ చూపించి అత్యాచారయత్నం చేశాడు.

Girl

దీనిని గమనించిన స్థానికులు అతడిని మందలించారు. తనను మానసికంగా, శారీరకంగా వేధించడంతో అవమానంగా భావించిన విద్యార్థిని ఇంటికి వచ్చాక కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేశారని తెలుస్తోంది.

భార్యాభర్తల వివాదంలో బిడ్డ బలి

భార్యాభర్తల వివాదంలో బిడ్డ బలైన విషాద ఘటన సోమవారం రాత్రి జరిగింది. మంగళహాట్‌లోని సీతారాంపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఖాన్‌‌‍కు రెండున్నరేళ్ల క్రితం హఫీజ్‌నగర్‌లోని జిర్రాకు చెందిన ఫాతిమాతో రెండో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆల్‌సబా అనే కుమార్తె ఉంది.

దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్ని నెలల నుంచి ఫాతిమా పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఆమె అత్తారింటికి వచ్చింది. మంగళహాట్‌లోని శంకర్‌కేఫ్‌ వద్ద ఆటోలో ఉన్న భర్త వద్దకు వెళ్లి తనను నిర్లక్ష్యం చేస్తున్నావెందుకని నిలదీసింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆమెను వదిలి వెళ్లడానికి మహ్మద్‌ ఖాన్‌ ఆటో స్టార్ట్‌ చేశాడు. ఫాతిమా ఆటోలో కూర్చోబోయింది. ఆమె కూర్చోకుండానే ఆటో ముందుకు కదలడంతో చేతిలోని పాప జారి కిందపడింది. ఆటో వెనుకచక్రం పాప పొట్ట మీదుగా వెళ్లింది. నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. నిర్లక్ష్యంతోనే ఆల్‌సబా మృతిచెందిందని మంగళహాట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+