మీరో మాటివ్వండి, ఎన్ని పరుగులో: జైట్లీ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ఇక తమ పార్టీకి ప్రజలు బాసటగా నిలవడమే తరువాయి అని బీజేపీ రాజ్యసభ పక్ష నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ 'తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాకు ఎన్నో రకాల రాజకీయ సమస్యలున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం. లోక్‌సభలో, రాజ్యసభలో మా మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తమ పార్టీ చేసిన కృషి వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టే తెలంగాణ ప్రజలను అభినందించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు.

అయితే రాజకీయ ప్రక్రియలో భాగంగా తెలంగాణ ఏర్పాటు పూర్తయిందని, చట్టబద్ధ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య పంపకాలు సాగుతున్నాయన్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడిందని, మరో అడుగు మిగిలి ఉందన్నారు. ఇటు తెలంగాణతోపాటు అటు అవశేష ఆంధ్రప్రదేశ్‌ల అభివృద్ధి సాధించాల్సి ఉందని చెప్పారు.

సభ

సభ

మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ 'తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభలో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సభ

సభ

రెండు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని, ఇప్పటికే రాజ్యసభలో సీమాంధ్ర సమస్యల కోసం బిజెపి పట్టుబట్టి సాధించిందని జైట్లీ చెప్పారు.

సభ

సభ

ఇటు తెలంగాణ ఇస్తూనే సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని రాజ్యసభలో సీమాంధ్ర సమస్యలపై మా పార్టీ గళమెత్తిందని,అనుకున్నట్లుగానే వాటిని పరిష్కరించుకోగలిందన్నారు.

సభ

సభ

అయితే ఇంతటితోనే ఆగిపోలేదని, రేపు తెలంగాణ, సీమాంధ్రల ఆర్థిక అభివృద్ధిపై పార్టీ దృష్టి పెట్టిందని, ఈ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపైనే భారం పడుతుందన్నారు.

సభ

సభ

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే, మోదీ ప్రధాని అయితే తప్పకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, మాటకు కట్టుబడి ఉంటామని, తెలంగాణ కోసం ఎలా కొట్లాడామో.. రేపటి తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆత్మశుద్ధితో పోరాడుతాం. కానీ, మీరు నాకో మాటివ్వాలన్నారు.

సభ

సభ

హిందుస్థాన్‌లో మోడీని ప్రధాని చేయడానికి అవసరమైన ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వాలని, తమ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని, అప్పుడు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

సభ

సభ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరం: జవదేకర్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర.. ఇలా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.

సభ

సభ

తెలంగాణ ఆవిర్భావ, అభినందన సభలో ఆయన ప్రసంగించారు. "జై జై తెలంగాణ. ప్రస్తుతం అందరి నోట తెలంగాణ, నరేంద్ర మోడీ మాట వినిపిస్తోందన్నారు.

సభ

సభ

తెలంగాణ సాధన కోసం ఎవరైతే సంఘర్షించారో వారందరికీ సలాం చెబుతున్నామని, నిన్న కేంద్రమంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందని చెప్పారని కానీ ఆయన వాస్తవాలు చెప్పాలన్నారు.

సభ

సభ

బిజెపి లేకుంటే తెలంగాణ వచ్చేదో లేదో వివరించాలని, పార్లమెంటు ఉభయ సభల్లో విభజన బిల్లును పాస్ చేయించుకునేందుకు ఆయన అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్‌ల వద్దకు ఎన్నిసార్లు పరుగులు పెట్టారో చెప్పాలన్నారు.

సభ

సభ

స్వాతంత్య్రం వచ్చాక 56 ఏళ్లపాటు కాంగ్రెస్ తెలంగాణపై విద్రోహానికి పాల్పడిందని, ఫలితంగా నవ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సభ

సభ

ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని, కానీ బిజెపి చిత్తశుద్ధితో తెలంగాణ కోసం ఉద్యమించిందని, బిజెపి వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు.

సభ

సభ

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని జవదేకర్ అన్నారు. కాగా సభలో మహిళలు బతుకమ్మలతో అలరించారు.

సభ

సభ

నరేంద్ర మోడీని దేశ ప్రధానిని చేసేందుకు బిజెపిని అఖండ మెజార్టీతో గెలిపించాలని తద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తోడ్పడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. కాగా, మధుప్రియ తన పాటలతో అలరించారు.

సభ

సభ

మంగళవారం నాడిక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మోడీ ప్రధాని కావాలని అధికశాతం ప్రజలు కోరుకుంటున్నారని, కిరణ్‌ కుమార్‌ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, ఆ పార్టీలో చేరే వారంతా మాజీలు, పార్టీల నుండి వెలివేసిన వారేనని ఎద్దేవా చేశారు.

సభ

సభ

బిజెపి మాత్రమే ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసిందని అన్నారు. 'నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయండి.. తెలంగాణ అభివృద్ధి చేయండి' అనే నినాదంతో తాము పనిచేస్తామని అన్నారు.

సభ

సభ

బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు ఈ దేశ ఉప ప్రధానిగా ఉన్న ఎల్‌కె అద్వానీ వచ్చినపుడు ఇదే గ్రౌండ్‌లో ఎ నరేంద్ర ఎంపిగా ఉన్నపుడు వారి నాయకత్వంలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశామని, 2006లో ఇదే గ్రౌండ్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసామని, జాతీయ నాయకత్వం తెలంగాణకు అనుకూలమని ఇదే గ్రౌండ్‌లో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారని, తాను తెలంగాణ పోరుయాత్ర నిర్వహించినపుడు కూడా ఇదే గ్రౌండ్‌లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+