విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ విషాదం: ప్రమాద సమయం నుంచి హైకోర్టు వరకు మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్

|
Google Oneindia TeluguNews

ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం.ఇందులో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

several killed Many fall sick afterGas leak at LG polymers Visakhapatnam:Live updates

లాక్ డౌన్ పీరియడ్‌లో ఈ పరిశ్రమ మూతపడింది. తాజా సడలింపుల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 4గంటలకు పరిశ్రమను తెరిచారు. ఇదే సమయంలో పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైంది. అది గాల్లో 3కి.మీ మేర వ్యాప్తి చెందడంతో స్థానికులపై తీవ్ర ప్రభావం పడింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఇక విశాఖ ఎల్జీ పాలిమార్స్ ప్రమాధ ఘటనపై మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
5:24 PM, 7 May

ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
4:02 PM, 7 May

బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్
3:49 PM, 7 May

ప్రమాద ఘటనపై వివరణ ఇచ్చిన ఎల్జీ సంస్థ ప్రతినిధులు, లాక్‌డౌన్ నేపథ్యంలో కంపెనీలో కెమికల్ నిల్వ ఉండిపోయిందని సీఎంకు చెప్పిన ప్రతినిధులు
3:48 PM, 7 May

విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిసిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు
3:26 PM, 7 May

విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు. ప్రమాదంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
3:25 PM, 7 May

మంత్రి కన్నబాబు సహా ఇతరులు కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తారు: సీఎం జగన్
3:24 PM, 7 May

మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తాం: కేంద్ర ప్రభుత్వం
3:17 PM, 7 May

గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలంటూ సీఎం కలెక్టర్‌కు ఆదేశం: సీఎం జగన్
3:05 PM, 7 May

విశాఖ ఘటనపై మీడియా రిపోర్టు ప్రకారం సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. 4వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్న జాతీయ మానవ హక్కుల సంఘం
2:54 PM, 7 May

బాధితులు కోలుకునేవరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తాం: సీఎం జగన్
2:53 PM, 7 May

ప్రాథమిక చికిత్స పొందుతున్నవారికి రూ. 25 లక్షలు పరిహారం: సీఎం జగన్
2:53 PM, 7 May

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం: సీఎం జగన్
2:52 PM, 7 May

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించిన సీఎం జగన్
2:44 PM, 7 May

పూణే నుంచి విశాఖకు ప్రత్యేక బలగాలను తరలిస్తున్నాం: ఎన్డీఆర్ఎఫ్
2:44 PM, 7 May

మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి : ఎన్డీఆర్ఎఫ్
2:43 PM, 7 May

10 మంది మృతి చెందారని ఇప్పుడే సమాచారం అందింది: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్ ఎన్ ప్రధాన్
2:42 PM, 7 May

3 కిలోమీటర్లు మేరా గ్యాస్ ప్రభావం చూపింది: కేంద్రం ప్రభుత్వం
2:41 PM, 7 May

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది: కేంద్ర ప్రభుత్వం
2:23 PM, 7 May

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు ఆదేశం ఇచ్చిన సీఎం జగన్
2:20 PM, 7 May

సిస్టమ్స్ అన్ని రన్నింగ్ లో లేకపోవడం వల్లే దుర్ఘటన జరిగింది: ఎల్జీ పాలిమర్స్ జీఎం
2:19 PM, 7 May

యాజమాన్యం స్పందన

పరిశ్రమ రన్నింగ్ లో లేకపోవడం వలనే ప్రమాదం..లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది: ఎల్జీ పాలిమర్స్ జీఎం
2:19 PM, 7 May

వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులు
2:19 PM, 7 May

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో 10 కి చేరిన మృతుల సంఖ్య
2:17 PM, 7 May

సీఎం జగన్‌కు ఘటన గురించి పూర్తిగా వివరిస్తున్న అధికారులు
2:15 PM, 7 May

విశాఖ ఘటనపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష
1:50 PM, 7 May

బాధితులను పరామర్శించి మాట్లాడిన సీఎం జగన్
1:46 PM, 7 May

కింగ్ జార్జ్ హాస్పిటల్

కింగ్ జార్జ్ హాస్పిటల్
కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో బాధితులు
1:43 PM, 7 May

విశాఖ కేజీహెచ్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్
1:41 PM, 7 May

కేజీహెచ్‌లో బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
1:31 PM, 7 May

విశాఖ ఘటనపై స్పందించిన దక్షిణ కొరియా సంస్థ, ఘటన కలచివేసింది: దౌత్యవేత్త షిన్‌బాంగ్
READ MORE

English summary
A major gas leak at LG Polymer chemical plant in Visakhapatnam has left hundreds sick and at least many dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X