వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్: ఒక వ్యాపారంలా, చక్రం తిప్పుతున్న రౌడీ షీటర్లు, మధ్యవర్తులు?

గుంటూరులో సెక్స్ రాకెట్ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. ఈ ప్రాంతంలోని పలు వ్యభిచార కూపాల్లో పలువురు స్త్రీల జీవితాలు మగ్గిపోతున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరులో సెక్స్ రాకెట్ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. ఈ ప్రాంతంలోని పలు వ్యభిచార కూపాల్లో పలువురు స్త్రీల జీవితాలు మగ్గిపోతున్నాయి.

రాజకీయ పలుకుబడి, బడాబాబుల అండదండలు ఉన్న కొంతమంది వ్యక్తులు.. ఆర్థిక ఇబ్బందులు, అవసరంలో ఉన్న నిస్సహాయులైన మహిళలను ఈ సెక్స్ రాకెట్ లోకి దింపుతున్నారు. ఫలితంగా వెలుగుచూడని వాస్తవాలెన్నో సమాధి అవుతున్నాయి.

జిల్లా కేంద్రంతోపాటు పరిసర పట్టణాల్లో సైతం వ్యభిచారం సాగుతోంది. బయటికి చెప్పుకోలేక కొందరు, చెప్పిన తరువాత వేధింపులు భరించలేక మరికొందరు.. ఇలా ఎంతో మంది మహిళల జీవితాలు చీకటి గృహాల్లోనే మగ్గిపోతున్నాయి.

విస్తరిస్తున్న వ్యభిచారం...

విస్తరిస్తున్న వ్యభిచారం...

ఒకప్పుడు గుంటూరు నగరంలోని కొత్తపేట ప్రాంతానికే పరిమితమైన వ్యభిచారం ఆ తరువాత తరువాత అరండల్ పేట, పట్టాభిపురంలోని నివాస ప్రాంతాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అపార్ట్ మెంట్లు, నగర శివార్లు, మంగళగిరి పరిసర ప్రాంతాలకు పాకింది. వ్యభిచారాన్ని పసిగట్టిన చుట్టుపక్కల వారు 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు అప్పటికప్పుడు రైడింగ్ చేసి వ్యభిచారిణులు, విటులను మాత్రమే అరెస్టు చేస్తున్నారు తప్ప.. అసలీ కూపం వెనుక ఉన్న పెద్ద తలకాయలను మాత్రం పట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Celebrities Drinking Aloe Vera To Escape SIT Interrogation
పెద్ద తలకాయలపై ఏదీ దృష్టి?

పెద్ద తలకాయలపై ఏదీ దృష్టి?

తెలిసి తెలిసి డబ్బు కోసం ఈ సెక్స్ రాకెట్ లోకి దిగిన మహిళలు ఉండొచ్చుగాక.. కానీ పరిస్థితుల ప్రభావంతో ఈ రొంపిలోకి దింపబడిన వారే అధికం. వ్యభిచార గృహాలపై దాడులు చేసినప్పుడల్లా పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచడంపైనే పోలీసు యంత్రాంగం అధిక శ్రద్ధ చూపుతోంది. కానీ బలవంతంగా ఈ వృత్తిలోకి అమాయక మహిళలను దింపుతున్నదెవరన్న కోణంలో పరిశోధన మాత్రం జరగడం లేదు. అలాగే వ్యభిచార వృత్తి నిర్మూలనకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో వ్యభిచార ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

పట్టించినా.. పట్టింపేదీ?

పట్టించినా.. పట్టింపేదీ?

కొన్ని రోజుల క్రితం గుంటూరు కొత్తపేటలోని శనక్కాయల ఫ్యాక్టరీ సమీపంలోని ఓ భవనంలో వ్యభిచారం నడుస్తోందంటూ పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు అక్కడికి చేరుకుని ఫిర్యాదు ఇచ్చిన వారికి, వ్యభిచార గృహం నిర్వాహకులకు మధ్య రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో కూడా రాజీ మార్గాలు వెతకడం, డబ్బుకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో ఇప్పటికే ఇక్కడి పోలీసులు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.

గతంలో గట్టి చర్యలు...

గతంలో గట్టి చర్యలు...

గతంలో ఎస్పీగా సీతారామాంజనేయులు, ఏఎస్పీగా భావనా సక్సేనా ఉన్నప్పడు వారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయించారు. సమస్యల మూలాల వరకు వెళ్లి విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిపైనే కాకుండా నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు.

వ్యాపారంగా మారిన వ్యభిచారం...

వ్యాపారంగా మారిన వ్యభిచారం...

ఆ తరువాత వారి స్థానాల్లో వచ్చిన పోలీసు అధికారులు ఈ విషయంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో ఇక్కడి ‘సెక్స్ రాకెట్' తన పరిధులను విస్తరించుకుంటోంది. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో రాజకీయ పలుకుబడి ఉన్న వారు, రౌడీ షీటర్లు జిల్లాలో వ్యభిచారాన్ని ఒక వ్యాపారంగా ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఎస్పీలు స్పందించి సెక్స్ రాకెట్ల ఆగడాలను అరికట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

కఠిన చర్యలు తీసుకుంటాం...

కఠిన చర్యలు తీసుకుంటాం...

సెక్స్ రాకెట్ ఆగడాలను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా పెడతామని, ఎక్కడైనా వ్యభిచారం జరుగుతున్నట్లు తెలిస్తే.. పౌరులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, ఇలా ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు తెలిపారు. ప్రజలు సహకరిస్తే ఏ స్థాయి వ్యక్తులపైనైనా రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

English summary
Prostitution is spreading rapidly in Guntur District. Some highly influencial persons and some rowdy sheeters involved in this Sex Racket and gradually they turned it as a business in this area. In the past.. Police have taken strict action against this but now-a-days they are overlooked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X