షాక్: బాలుడిపై యువకులు గ్యాంగ్‌రేప్, వీడియో తీసి వాట్సప్‌లో..

Subscribe to Oneindia Telugu

కృష్ణా: జిల్లాలోని పెనమలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న ఒక బాలుడి(12)పై ఇద్దరు కామాంధులైన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీసి, బాలుడిపై బెదరింపులకు దిగారు.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోరంకిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడుకు చెందిన బాధిత బాలుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.

gangrape

జూన్‌ 22న బాలుడు పాఠశాలకు వెళ్తుండగా రాధాకృష్ణ, దుర్గాప్రసాద్‌ అనే యువకులు అతడికి మాయమాటలు చెప్పి సైకిల్‌పై ఎక్కించుకొని పోరంకి నారాయణపురం కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడే అతనిపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు.

ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరింపులకు గురిచేశారు. ఆ తర్వాత బాలుడితో జులై 3న ఒక సైకిల్‌ను చోరీ చేయించారు. అంతేగాక, ఆ ఇద్దరు అత్యాచారం వీడియోను బ్లూటూత్‌ ద్వారా పలువురికి పంపుతుండగా ఈ దారుణం గురించి బాలుడి కుటుంబసభ్యులకు తెలిసింది.

బాలుడిని వెంటబెట్టుకొని కుటుంబసభ్యులు బుధవారం పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులు రాధాకృష్ణ, దుర్గాప్రసాద్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a 12-year-old boy was raped by two men in a desolate place near Enikepadu in Vijaywada. The miscreants have also filmed the act and shared it with their friends through Whatsapp.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి