విద్యార్థినులపై ప్రోఫెసర్ లైంగిక వేధింపులు, ధర్నా

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: ఆంధ్రా విశ్వవిద్యాలయం సంస్కృత ఆచార్యుడు ఏడుకొండలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోమవారం నాడు
విద్యార్థునులు నిరసనకు దిగారు. ఆయనపై గతంలోనూ కూడ ఇదే తరహ ఆరోపణలున్నాయి

దీంతో రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్నారు. నెలరోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరిన ఆయనకు సంస్కృత విభాగం అధిపతిగా తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఏడుకొండలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు సోమవారం ఆందోళనకు దిగారు.

sexual harassment allegations on AU professor

రెక్టార్‌ ఆచార్య గాయత్రీ దేవి కారును అడ్డగించి ఆయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.
అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఏడుకొండలు ఖండించారు.

సంస్కృత విభాగంలో పరీక్షలు ప్రారంభమయ్యాయని, హాజరు శాతం తక్కువగా ఉన్న వారిని అనుమతించకపోవడం వల్లనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా యూనివర్శిటీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sexual harassment allegation on Andhra university professor Yedukondalu. students protest against professor at University campus on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి