మీ తండ్రి మొహం చాటేశారు: కెటిఆర్‌కు షబ్బీర్ ప్రశ్న

పోలవరం ముంపు గ్రామాలపై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్తానన్న కెసిఆర్ హామీ ఏమైందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఆపేందుకు కెసిఆర్ చేసిన ప్రయత్నాలేమిటని ప్రశ్నించారు. 1956కు ముందున్న ప్రాంతాలనే తెలంగాణలో కలపాలని కెసిఆర్ కోరడం వల్ల ముంపు గ్రామాలు ఆంధ్రలోకి వెళ్తున్నాయని ఆయన అన్నారు.
పోలవరం ఆర్డినెన్స్‌పై కెసిఆర్ అనుసరిస్తున్న తీరున సిపిఐ కూడా ప్రశ్నిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు వెనుకాడుతున్నారంటూ సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో అందర్నీ సమన్వయం చేయాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. ముంపునకు గురికాని ప్రాంతాలను ఏపీలో కలుపుతూ రూపొందించిన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం బీజేపీకి మెజార్టీ లేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌పై తెలంగాణ బీజేపీ, టీడీపీలు వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వారు వెంకయ్యనాయుడు, చంద్రబాబుల కోసమే పనిచేస్తారా, గిరిజనుల పక్షం వహిస్తారా తేల్చుకోవాలని వెంకటరెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ కాంగ్రెస్ హయాంలోనే తయారైందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గత ప్రభుత్వంపై తోసేస్తున్నారని, అలా చెప్పడానికి సిగ్గుండాలన్నారు.












Click it and Unblock the Notifications