బాబు, కేసీఆర్‌లు వాళ్లకంటే మొనగాళ్లా: షబ్బీర్ అలీ

Shabbir Ali slams KCR and Chandrababu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారేమైనా మొనగాళ్లా అంటూ ప్రశ్నించారు. ఆయన ఫీజు రీయింబర్సుమెంట్స్ అంశం పైన మాట్లాడారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు సెంటిమెంటును రెచ్చగొట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. భారత్‌తో చైనా, పాకిస్తాన్ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాయన్నారు. కేసీఆర్, చంద్రబాబులు వాళ్లకంటే మొనగాళ్లా అని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో చంద్రబాబు ఒంటెత్తు పోకడలకు పోకుండా సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగాలన్నారు.

కౌన్సెలింగ్‌కు వెళ్లవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. విద్యార్థులను కౌన్సెలింగ్‌కు వెళ్లవద్దన్న జగదీశ్వర్ రెడ్డి వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. ఏమీ చెప్పకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లవద్దంటే నష్టపోయేది విద్యార్థులే అన్నారు. విద్యార్థులను టెన్షన్ పెడుతున్నారన్నారు.

10వేల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం: కేటీఆర్

హైదరాబాదును వైఫై సిటీగా మార్చాలని నిర్ణయించామని, దీనికోసం సిటీలో అనేక సెల్‌ఫోన్ టవర్లు అవసరమవుతాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. త్వరలోనే 10వేల గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు.

సెల్ టవర్లు, ఆరోగ్యం అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ తగిన మోతాదులో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+