వీడియోలు చూసి ఆనందిస్తున్నారా?: 'షేమ్ ది రేపిస్ట్ కంపైన్' సునితా
హైదరాబాద్: తాను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన వీడియోను ఆరు నెలల క్రితమే చూశానని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, ఇలాంటి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అంటూ ప్రముఖ స్వచ్ఛంధ కార్యకర్త సునితా కృష్ణన్ శుక్రవారం ప్రశ్నించారు. అత్యాచార బాధితులకు అండగా నిలుస్తూ.. రేపిస్ట్‌ల ఫోటోలను సామాజిక అనుసంధాన వెబ్‌సైట్‌లో పెట్టిన సునితా కృష్ణన్ పైన ఈ రోజు హైదరాబాదులోని పాతబస్తీలో దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రేపిస్ట్స్‌ను ఎక్స్‌పోజ్ చేశానని, ఈ నేపథ్యంలో తన పైన దాడి జరిగిందని చెప్పారు. తాను నిందితుల ఫోటోలను సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఎవరైనా వారిని గుర్తిస్తే చెప్పాలని కోరానని తెలిపారు. తాను నిన్న సాయంత్రం సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఈ రోజు జాతీయ మీడియా ద్వారా తాను ప్రచారం చేశానని తెలిపారు.
అనంతరం తొమ్మిది గంటల తర్వాత తన పైన దాడికి యత్నం జరిగిందని చెప్పారు. తన కారును ధ్వంసం చేశారన్నారు. నిందితులు రేప్ చేయడమే కాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడటానికి వారికి ఎందుకు ఇంత ధైర్యం అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తాను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. బాధితులు తన వద్దకు ఇక ముందు కూడా వస్తారని, ఇలా చాలా వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించారు.

అయితే, ఇలాంటి దుర్మార్గాల పట్ల తాను ఒక్కదానినే రిపోర్ట్ చేస్తే సరిపోదన్నారు. అందరు కలిసి రావాలని కోరారు. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఆరు నెలల క్రితమే రేప్‌కు సంబంధించిన వీడియోను చూశానని చెప్పాడని, వాటిని చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. జరిగిన ఘోరాల పైన ఎవరికైనా ఫిర్యాదు చేసే ధైర్యం లేకుంటే తనను కలిసి చెప్పవచ్చునని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అత్యాచారానికి సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయని, ఒకటి ఉత్తర ప్రదేశ్ లేదా ఢిల్లీలో జరిగి ఉంటుందని చెప్పారు. ఈ రోజు తన పైన జరిగిన దాడి విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు బాగా స్పందించారని సునితా కృష్ణన్ పేర్కొన్నారు. యూట్యూబ్‌లో తాను నిందితుల గురించి పెట్టిన వీడియోలను తొలగించారని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఏదైనా సంఘటన జరిగితే ఎవరు కూడా ఫిర్యాదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేప్‌కు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా, నిందితులు సునితా కృష్ణన్ ఫేస్ బుక్, యూ్ట్యూబ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. తాను వీడియోల పైన పోరాటం ప్రారంభించానని చెప్పారు.
తన పైన దాడి జరిగిన అంశంపై ఆమె సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలోను స్పందించారు. ఎన్డీటీవీలో తాను 'షేమ్ ది రేపిస్ట్ కంపైన్' గురించి మాట్లాడిన అర్ధగంటలో అంటే ఉదయం తొమ్మిదిన్నరకు తన కారును ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications