కొత్తగా పెళ్లైనట్టు: నవ్వుతూనే పవన్‌పై షర్మిల నిప్పులు
రాజమండ్రి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఆదివారం దుమ్మెత్తి పోశారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ పైన నిప్పులు చెరిగారు. ఓ పిచ్చి వ్యక్తి మన గ్రామానికి వచ్చి.. వారికి ఓటేయాలని, తాను చెప్పినట్లు వినాలని చెబితే మనం వినమని, అలాగే పిచ్చోడికి, పవన్‌కు తేడా లేదని ఆమె అన్నారు.
పవన్‌కు మతిస్థిమితం లేదన్నారు. పవన్ మెదడుకు, మాటలకు ఎక్కడా పొంతన ఉండదన్నారు. పవర్ కోసం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెంకయ్యను, మోడీని చివరకు పవన్‌ను కూడా ప్రచారంలోకి తీసుకు వచ్చారన్నారు. పవన్, చంద్రబాబులు కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్లాల్లా వ్యవహరిస్తున్నారని నవ్వుతూ ఎద్దేవా చేశారు. పవన్ ఏం ఆలోచిస్తారో ఆయన అభిమానులకు కూడా అర్థం కాదన్నారు.

పవన్ ఎప్పుడు ఎలా మారుతాడో ఎవరికీ తెలియదన్నారు. ఊసరవెల్లి తన ప్రాణాలను రక్షించుకునేందుకు రంగులు మారుస్తుందని కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్వార్థం కోసం రంగులు మార్చుతున్నారన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించిన పవన్.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోసి ఇప్పుడు ఆయనకు ఎలా మద్దతు పలుకుతున్నారో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు సీమాంధ్రకు హీరోల్లాగా ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. పవన్‌కు విలువలు, విశ్వసనీయత లేదని, ఆయనకు ఉన్నదంతా లెక్కలేనంత తిక్క మాత్రమే ఉందన్నారు. పవన్ పేరుకు తగ్గట్టే ఆయన మాటలు గాలి మాటలని, సొల్లు మాటలని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications