ఒంటరిగా: కడప నుండి జగన్ వెళ్లారు.. షర్మిల వచ్చారు!

కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిల గైర్హాజరీలో రెండు రోజుల పాటు సొంత ఇలాకా కడపలో పర్యటించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతించడంతో శనివారం ఉదయం కడప జిల్లాకు చేరుకున్న జగన్ ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కోర్టు అనుమతితో జగన్ శనివారం, ఆదివారం కడపజిల్లాలో పర్యటించారు. శనివారం మొదట తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం రెండు రోజుల పాటు భేటీలు జరిపారు. గత నెలలో జగన్ బెయిల్ పొందిన అనంతరం ఇడుపులపాయకు వెళ్లారు. అప్పుడు కూడా వెంట షర్మిల లేరు.
జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కడప జిల్లాలో పర్యటించిన రెండు రోజుల అనంతరం షర్మిల వచ్చారు.












Click it and Unblock the Notifications