శర్వానంద్-రక్షితరెడ్డి విడిపోయారా? లేదా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న శర్వానంద్ జనవరిలో రక్షితరెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. అకస్మాత్తుగా ఈ ఫంక్షన్ జరిగేసరికి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. పరిశ్రమ నుంచి రామ్ చరణ్, అక్కినేని అఖిల్, అదితీరావు తదితరులు హాజరైశుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి నిశ్చితార్థం తర్వాత వివాహం జరగడానికి ముహూర్తాలను బట్టి 20 రోజుల నుంచి నెలరోజుల సమయం చూసుకుంటారు.
అయితే మే నెల కూడా పూర్తికావస్తుండగా శర్వానంద్ వివాహం గురించి ఎటువంటి అప్ డేట్ రావడంలేదు. వీరి వివాహం ఆగిపోయిందంటూ రూమర్స్ వ్యాపిస్తుండటం అభిమానులను గందరగోళానికి గురిచేసింది. శర్వానంద్, రక్షితరెడ్డి విడిపోయారంటూ వార్తలు వస్తుండటాన్ని శర్వానంద్ టీమ్ దీన్ని ఖండించింది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిని తిప్పికొట్టింది. వారిద్దరూ విడిపోయారనేది నిజం కాదని, సంతోషంగా కలిసివున్నారని, శ్రీరామ్ ఆదిత్యతో చేయబోయే సినిమా షూటింగ్ లో శర్వా బిజీగా ఉన్నట్లు తెలిపింది.

లండన్ లో ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల షెడ్యూల్ జరిగిందని అది పూర్తిచేసుకొని కొద్దిరోజుల క్రితమే భారతదేశానికి తిరిగివచ్చాడని పేర్కొంది. వివాహం చేసుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్న శర్వానంద్ అందుకు ముందుగా తాను ఒప్పుకున్న సినిమాను పూర్తిచేయాలనుకుంటున్నారని, అది పూర్తయిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. రక్షిత కుటుంబాన్ని కలిసి త్వరలోనే వివాహ తేదీని నిర్ణయిస్తారని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే విడుదలవుతుందని శర్వా టీమ్ వెల్లడించింది.
శర్వానంద్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను జనవరిలో పోస్ట్ చేశారు. తన సంతోషాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ తనకోసం ఒకరిని కనుగొన్నట్లు శీర్షిక పెట్టారు. వీరిద్దరి జంట బాగుంటుందని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందంటూ అభిమానులు వారికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications