ప్రియుడి ట్విస్ట్: పెళ్ళి రద్దు చేయించి, ఆత్మహత్యాయత్నం
మదనపల్లె: తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే కారణంగా ఓ యువకుడు ప్రియురాలి ఇంటి ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకొంది.
మూడేళ్ళ పాటు ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించడంతో ప్రియురాలి ఇంటి ఆవరణలోనే ప్రియుడు కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లె పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకొంది.
ప్రియురాలు గత ఏడాది డిసెంబర్ లో మరో వ్యక్తితో వివాహనికి సిద్దపడడంతో ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్ళి పత్రికలు కూడ పంచిన సమయంలో ఆ వివాహన్ని రద్దు చేయించాడు ప్రియుడు శశికుమార్

ప్రియురాలి ఇంటి ఆవరణలోనే ప్రియుడి ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్డులో నివాసం ఉండే శశికుమార్ బీటెక్ చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ ను ప్రేమించాడు. మూడేళ్ళపాటు ప్రేమించానని వెంటపడ్డాడు. అయితే గత ఏడాది ఆ యువతి వేరే యువకుడితో వివాహనికి ఒప్పుకొంది. దీంతో సోమవారం నాడు ప్రియుడు శశికుమార్ యువతి ఇంటి ఆవరణలోనే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పెళ్ళి రద్దు చేయించిన ప్రియుడు
మరో యువకుడితో యువతికి పెళ్ళి నిశ్చయమైంది. అయితే అదే సమయంలో వివాహ పత్రికలను కూడ పంచేశారు. ఈ విషయం తెలుసుకొన్న ప్రియుడు శశికుమార్ ఈ వివాహన్ని రద్దు చేయించారు. దీంతో శశికుమార్ పై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సూసైడ్ నోట్ లో ప్రియురాలి కుటుంబసభ్యుల పేర్లు
సోమవారం రాత్రి ప్రియురాలి ఇంటి వద్దకు వచ్చి ఆమె తనను మోసం చేసిందంటూ కత్తితో పొత్తు కడుపులో పొడుచుకున్నాడు. అలాగే తన చావుకు కారణం ప్రియురాలు, ఆమె తల్లిదండ్రులేనని సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్థానికులు గుర్తించి శశికకుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శశికుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సూసైడ్ నోట్‌లో ప్రియురాలి గురించి
శశికుమార్ ఉపయోగించిన కత్తిని , సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శశికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ప్రియురాలి కుటుంబసభ్యులను కూడ విచారించారు. శశికుమార్ ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించాడని ప్రియురాలి కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.అయితే శశికుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications