అరుదైన సంఘటన: కర్నూలు జిల్లాలో పశువుల కాపరికి దొరికిన వజ్రం
అమరావతి: కర్నూలు జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పశువులు కాస్తున్న ఒక యువకుడికి లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండం జొన్నగిరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పశువులు కాసే నిమిత్తం చుట్టుపక్కల పొలాల్లోకి గేదేలను తోలుకెళ్లాడు.
పశువులు కాస్తున్న సమయంలో అతడు కళ్లకు మిల మిల మెరుస్తూ ఓ వజ్రం కంటపడింది. ఈ వజ్రాన్ని బహిరంగ వేలం వేయగా జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రూ.5.60 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

క్రికెట్ బెట్టింగ్‌తో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఓ యువకుడు బలైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది. బెట్టింగ్ డబ్బులు చెల్లించకపోవడంతో యాదవోలు గ్రామానికి చెందిన రవి ప్రసాద్ అనే యువకుడిపై బెట్టింగ్ ముఠా దాడిచేసింది.
ఈ దాడితో మనస్తాపం చెందిన రవిప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్‌లో భాగంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ ముఠా దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications