Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్‌ జగన్‌తో శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ, రేపు వైసీపీలో చేరిక, అలా చేసి రమ్మన్న జగన్?

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు జిల్లా నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు జిల్లా నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా జగన్‌ దగ్గరకు వెళ్లారు. తాను టీడీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను జగన్‌కు వివరించారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో రేపు ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరనున్నారు.

shilpa-jagan

'రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతాను. నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తా' అని నశిల్పా చక్రపాణిరెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు.

మరోవైపు నంద్యాల ఎస్పీజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రమ్మన్న జగన్?

శిల్పా చక్రపాణి రెడ్డి దాదాపు గంట సేపు జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాతే తమ పార్టీలోకి రావాలని జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో చక్రపాణిరెడ్డి ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. భేటీ అనంతరం జగన్ బయటికి వెళ్లినప్పటికీ, శిల్పా చక్రపాణి రెడ్డి ఇంకా లోటస్ పాండ్ వద్దనే ఉన్నారని, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+