'శిల్పా లోకల్, బ్రహ్మనందరెడ్డి నాన్‌లోకల్', 'ఎవరేమిటో ప్రజలకు తెలుసు'
శిల్పా మోహన్‌రెడ్డి లోకల్, భూమా బ్రహ్మనందరెడ్డిని వెతుక్కోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.చంద్రబాబు కారణంగానే భూమా నాగిరెడ్డి చనిపోయారని రోజా ఆరోపణ
నంద్యాల: వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్థానికుడని, ఆయనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటారో వెతుక్కోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గోస్పాడు మండలంలోని యాళ్ళూరులో ఆమె రోడ్‌షో నిర్వహించారు.ఎవరైనా తమ పార్టీకే ఓటు వెయ్యాలని బెదిరిస్తే భయపడవద్దని, ప్రజలకు జగన్ అండగా ఉన్నాడని, అవసరమైతే టీడీపీ తాట తీస్తాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని, భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేయడం వల్లే ఆయన గుండెపోటుతో మరణించాడని రోజా ఆరోపించారు.అలాంటి చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని రోజా విమర్శించారు.
స్ధానికులెవరో స్థానికేతరులెవరో ప్రజలకు తెలుసు
నంద్యాలలో స్థానికులు ఎవరో...స్థానికేతరులు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
12 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, అందుకే శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడటం లేదని మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. అందరి చరిత్ర ప్రజలకు తెలుసునని మంత్రి అఖిలప్రియ చెప్పారు.












Click it and Unblock the Notifications