చెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పా

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు/విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికల టిక్కెట్‌ను మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం కూడా అడుగుతోందని, కానీ తనకు ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పానని శిల్పా మోహన్ రెడ్డి ఆదివారం చెప్పారు.

నంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా?

శిల్పా సోదరులు ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక, టిక్కెట్ అంశంపై చర్చించారు. భేటీ అనంతరం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్‌పై చంద్రబాబుతో చర్చించామన్నారు.

Shilpa Mohan Reddy

చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత ఈ అంశం కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. నంద్యాల సీటు విషయంలో తమ అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా వివరించామన్నారు. ఎవరిని పోటీకి నిలపాలన్న నిర్ణయాధికారం చంద్రబాబుదే అన్నారు. తమకు సీటు ఇవ్వాలా? వద్దా? అన్నది సీఎం నిర్ణయిస్తారని, తమకు అన్యాయం జరగబోదని భావిస్తున్నామని, చంద్రబాబు నోటి నుంచి ఎవరి పేరు వచ్చినా సమ్మతమేనన్నారు.

కచ్చితంగా తమకే టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. భూమా కుటుంబం కూడా టిక్కెట్ కావాలని కోరుతున్నారని, కానీ గత ఎన్నికల్లో తాను పోటీ చేసినందున ఇప్పుడు కూడా నాకే ఇవ్వాలని చెప్పానన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shilpa Mohan Reddy on Sunday met AP CM Nara Chandrababu Naidu for Nandyal ticket.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి