సిద్ధం కాలేదు, కేబినెట్ నోట్‌కు కొంత టైం: టిపై షిండే

కాగా, రక్షణమంత్రి ఆంటోనీ అస్వస్థత నుంచి ఇంకా కోలుకోననందువల్లే కేబినెట్ నోట్ పెండింగ్‌లో పడిందని తెలుస్తోంది. నిజానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా వెళ్లేముందు జరిగే కేబినెట్ భేటీలో ఈ నోట్‌ను పరిశీలించవచ్చునని భావించారని, అయితే ఆంటోనీ లేనందువల్ల నోట్ తయారీ పూర్తికాలేదని చెబుతున్నారు.
ఆంటోనీ కమిటీ సిఫారసుల అనంతరమే నోట్‌ను పూర్తి చేయాలని కోర్ కమిటీ గతంలోనే నిర్ణయించింది. కేబినెట్ భేటీ ఎజెండాలో తెలంగాణ అంశం లేదని, ప్రధాని అమెరికా నుంచి వచ్చాక అక్టోబర్ తొలివారం కేబినెట్ సమావేశంలో ఇది ప్రస్తావనకు రావచ్చని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, కేబినెట్ నోట్ తయారీ, మంత్రుల బృందం ఏర్పాటు, అసెంబ్లీకి తీర్మానం పంపడం, బిల్లు రూపకల్పన, అసెంబ్లీలో చర్చ, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం వంటి అంశాలకు సమయం సరిపోతుందా లేదా అన్న విషయంపై కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలంటే ఇంకా ఎంతో తతంగం జరగాలి. అందుకు సమయం సరిపోతుందా... అని ఒక విలేకరి అడిగినప్పుడు ఈ విషయం హోంశాఖ నిర్ణయించుకోవాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ చెప్పారు.












Click it and Unblock the Notifications