షిర్డీ సాయి భక్తుల కోసం వీఐపీ పాస్ - ఎలా పొందాలంటే..!!

షిర్డీకి భక్తుల రద్దీ పెరిగింది. దేశం నలుమూలల నుంచి సాయి భక్తులు దర్శనం కోసం తరలి వస్తున్నారు. నిత్యం షిర్డీ దేవస్థానంలో ఇచ్చే నాలుగు హారతులకు ప్రాధాన్యత ఉంది. ఈ హారతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పెరుగుతున్న రద్దీతో సాయిబాబా దర్శనం కోసం గంటల తరబడి వేచి చూాల్సి వస్తోంది. ఈ సమయంలోనే షిర్టీ సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సమయం వేచి చూడకుండానే భక్తులకు వెసులుబాటు కల్పించింది.

షిర్డీకి పెరుగుతున్న భక్తుల రద్దీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వీఐపీ దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థాన్ కు చెందిన అధికారిక పోర్టల్ ...ఆఫ్ లైన్ లోనూ ఈ అవకాశం పొందవచ్చని ప్రకటించింది. ఈ పోర్టల్ ద్వారా వీఐపీ దర్శనంతో పాటుగా హారతి సేవ..పూజలు..వసతి వంటి వాటిని పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది. సాయిబాబా దర్శనం కోసం గురుపౌర్ణమి, విజయదశమి, దీపావళి..ప్రతీ గురువారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజులన్నీ షిర్డీలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులకు త్వరగా దర్శనం..సేవలు అందించేందకు తాజాగా ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా పోర్టల్ లో వివరాల నమోదు ద్వారా దర్శనం పొందే అవకాశం కల్పించింది.

shiridisai

షిర్డీ సంస్థాన్ అధికారిక పోర్టల్ కావాల్సిన ప్రాధమిక వివరాలు ఎంటర్ చేసిన తరువాత ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. షిర్డీకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తోంది. అందుకు భక్తుడి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు జత చేయాలి. లాగిన్ ప్రక్రియ పూర్తయిన తరువాత భక్తులకు కావాల్సిన దర్శన..హారతి..వసతి సేవలు అప్షన్లుగా ఉంటాయి. కావాల్సిన తేదీకి ముందుగానే ఈ సౌకర్యం ద్వారా టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణ దర్శనం.హారతికి ముందస్తుగా బుకింగ్ కు అవకాశం ఉంది. ఇప్పుడు వీఐపీ టికెట్లను కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. నిర్ణీత ధర చెల్లించటం ద్వారా దర్శనంతో పాటుగా వసతి కూడా ఆన్ లైన్ లోనే రిజర్వ్ చేసుకొనే అవకాశం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+