శివ భార్య జూనియర్ ఆర్టిస్ట్, అనుచరులు వీరే (పిక్చర్)

హైదరాబాద్: పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మోస్ట్‌వాంటెడ్ చైన్‌స్నాచర్ శివ అలియాస్ సాంబ అనుచరులను సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 30 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డిసిపి రమేష్ నాయుడు తెలిపారు. నార్సింగ్‌లో నివాసముంటున్న శివ ఇంటిపై దాడి చేయగా మండపతి జగదీష్ అలియాస్ జగ్గా (30), రాజ్‌కుమార్ (23), నాగలక్ష్మి అలియాస్ మణి (30)లను అరెస్టు చేశామని ఆయన చెప్పారు.

ఆయన అందించిన వివరాల ప్రకారం - జగదీష్ నెల్లూరు జిల్లా ఓగిలి మండలం ఆర్మూర్‌పాడు గ్రామం. 2002లో శివకుమార్ తిరుపతి పోలీసులు దొంగతనం కేసులులో అరెస్టు చేసినప్పుడు జైలులో శివకి జగదీష్‌కి పరిచయం ఏర్పడింది. రాజ్‌కుమార్ వైజాగ్ వాసి చైన్ స్నాచింగ్ కేసులో విశాఖపట్నం జైలులో శివకి పరిచయం ఏర్పడింది. మరో నిందితురాలు శివ భార్యది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ ఆర్టిస్టుగా సీరియల్స్‌లో నటిస్తు ఫిలింనగర్‌లో నివాసం ఉండే సమయంలో శివతో ప్రేమలో పడి అనంతరం 2005 అన్నవరంలో వివాహం చేసుకున్నారు.

Shiva's associates produced before media

సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో 700 వరకు గొలుసు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. 2014లో సైబరాబాద్ పరిధిలోనే 215 గొలుసు దొంగతనాలు చేశారని వివరించారు. ఐదు రకాలుగా దొంగతనాలకు పాల్పడేవారని, అవి నగలు ధరించుకుని వాహనంపై వెళ్లేవారిని వెంబడించి ఆభరణాలు లాక్కుని పారిపోయేవారని, ఇంటి ముందు పని చేసుకునే వారి మెడలో నుండి లాక్కుపోవడం, నడుచుకుంటూ వెళ్లే మహిళల నుండి, కారు దూరంగా ఆపి స్నాచింగ్ చేసుకుని కారలో పారిపోవడం, ఒంటరి మహిళలను చిరునామా లేక ఇల్లు అద్దెకు కావాలని అడిగినట్లు నటించి నగదు అపహరించేవారని డిసిపి తెలిపారు.

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ నగలను తాకట్టు పెట్టుకునే శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, ముత్తుట్ ఫైనాన్స్ వంటి ప్రైవేటు సంస్థలపైన కేసు నమోదు చేస్తున్నట్లు డిసిపి రమేష్‌నాయుడు తెలిపారు. వీరి వద్ద నుండి 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన కార్లు, రెండు మోటారు సైకిళ్లు, విలువైన ఫర్నిచర్‌ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+