వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు కౌంటర్: శివప్రసాద్ ధిక్కారం, 2019పై తేల్చేశారు

మంత్రివర్గంలో దళితులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని, దళితులను మోసం చేశారంటూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మరోసారి పార్ట

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: మంత్రివర్గంలో దళితులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని, దళితులను మోసం చేశారంటూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మరోసారి పార్టీకి ధిక్కార స్వరం వినిపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

లొంగదీసుకోలేరు, చర్యలు తప్పవు: శివప్రసాద్‌‌కు బాబు హెచ్చరిక, కారణం అదేనా?లొంగదీసుకోలేరు, చర్యలు తప్పవు: శివప్రసాద్‌‌కు బాబు హెచ్చరిక, కారణం అదేనా?

తప్పు చేయలేదు..

తప్పు చేయలేదు..

తాను ఎప్పుడు తప్పు చేయలేదని, ఓపెన్‌గా మాట్లాడానని శివప్రసాద్ అన్నారు. దళితులకు న్యాయం చేయమని మాత్రమే అడిగానని అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేం లేదని సమర్థించుకున్నారు. మనసులో ఉన్నదే మాట్లాడానని.. కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు. ఎంపీలకు సీఎం చంద్రబాబు సమయం ఇవ్వడం లేదని అన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఆయనతో మాట్లాడేందుకు ఎంపీలకు అవకాశం రావడం లేదని చెప్పారు. మిగితా ఎంపీలదీ ఇదే ఆవేదన అన్నారు.

ఎలావున్నావని అడగలేదు... హర్టయ్యా..

ఎలావున్నావని అడగలేదు... హర్టయ్యా..

దళితులకు భూమి ఇప్పించేందుకే పోరాడుతున్నా.. 2003లో చంద్రబాబు ఇచ్చిన జోవో ప్రకారమే సిఫార్సు చేసినట్లు శివప్రసాద్ తెలిపారు. 70ఏళ్లుగా దళితులు భూమి కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచానని అన్నారు. గతంలో ఈ విషయంపై చంద్రబాబును అడిగి.. తర్వాత వదిలేశానని చెప్పారు. 6నెలల క్రితం ఓ కార్యక్రమంలో తాను గాయపడ్డానని.. చంద్రబాబు కనీసం దెబ్బేమైనా తగిలిందా? అని కూడా అడగలేదని అన్నారు. అప్పుడు తాను చాలా హర్టయ్యానని చెప్పారు.

చిన్నప్పట్నుంచీ చంద్రబాబుతో ఉన్నా..

చిన్నప్పట్నుంచీ చంద్రబాబుతో ఉన్నా..

చిన్నప్పటి నుంచి చంద్రబాబుతో ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో దళిత పథకాల సమాచారం ప్రజాప్రతినిధులకు తెలియజేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు అన్ని విషయాలు నివేదనా చేశానే తప్ప, ఆల్టిమేటం కాదని శివప్రసాద్ చెప్పారు.

2019లో చాలా పార్టీలున్నాయ్

2019లో చాలా పార్టీలున్నాయ్

తాను కేవలం కుప్పం ఓట్లతోనే గెలువలేదని ఎంపీ శివప్రసాద్ స్పష్టం చేశారు. 800 కేవలం తనకు 800 ఓట్లే అవసరమయ్యాయని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చంద్రగిరి, నగరి, జి.నెల్లూరులో కూడా తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. తన భార్యకు డాక్టర్‌గా ఉన్న పేరు, ఆమె రెడ్డి సామాజిక వర్గం తనకు అదనంగా ఓట్లు తీసుకొచ్చాయని చెప్పారు. అంతేకాగా, 2019లో పోటీ చేసేందుకు తనకు చాలా పార్టీలున్నాయని శివప్రసాద్ తేల్చి చెప్పారు.

శ్రీకృష్ణదేవరాయలు, చాణక్యుడితో పోల్చా..

శ్రీకృష్ణదేవరాయలు, చాణక్యుడితో పోల్చా..

కాగా, ప్రజలంతా ఏమనుకుంటున్నారో చంద్రబాబు తెలుసుకోవాలని సూచించినట్లు చెప్పారు. నా దళితులకు ఒక్క సెంటు భూమి కూడా ఇప్పించుకోలేకపోతున్నానని శివప్రసాద్ అన్నారు. తాను చంద్రబాబును శ్రీకృష్ణదేవరాయలు, చాణుక్యుడితో పోల్చానని అన్నారు. తమ నాయకుడు అభినవ అంబేద్కర్‌లా ఉండాలని తన కోరిక అని శివప్రసాద్ చెప్పారు.

నన్ను అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నా..

నన్ను అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నా..

కబ్జా చేసిన 7ఎకరాల భూములను వదిలేశారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే జీవోను ఎందుకు వదిలేశారని తాను ప్రశ్నించానని తెలిపారు. దళితులకు చేయాల్సిన పని చేయకుండా తప్పించుకుంటే ఎలా? అని నిలదీశానని చెప్పారు. తనను నియోజకవర్గం ప్రజలు ఎంతగానో అభిమానిస్తారని చెప్పారు. తనకు భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవని శివప్రసాద్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి న్యాయం చేయాలని కోరానని తెలిపారు. తనను అర్థం చేసుకోవాలని తాను టీడీపీ అధిష్టానంకు విన్నవించుకున్నానని తెలిపారు. దళితుల కోసమే తన పోరాటామని శివప్రసాద్ స్పష్టం చేశారు. తనను దెబ్బకొట్టడానికి వారికి ఏమీ దొరకలేదని, ఈ లెటర్ మాత్రం దొరకిందని అన్నారు.

సినీ నటుడిని ఎంపీ చేశారు

సినీ నటుడిని ఎంపీ చేశారు

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి జవహర్ స్పందించారు. సినీ నటుడైన శివప్రసాద్‌ను చంద్రబాబునాయుడు ఎంపీగా చేశారని మంత్రి పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అభినవ అంబేద్కర్ అని, చంద్రబాబు హయాంలోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు.

చంద్రబాబుపై విమర్శలు సరికాదు

చంద్రబాబుపై విమర్శలు సరికాదు

సీఎం చంద్రబాబుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గతంలో సీనియర్ అయిన బొజ్జలను కాదని, శివప్రసాద్ కు మంత్రి ఇచ్చారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు హెచ్చరిక

చంద్రబాబు హెచ్చరిక

కాగా, వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతూ, పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోనని చంద్రబాబునాయుడు.. శిప్రసాద్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీలో శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు స్పందన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

English summary
Telugudesam MP Shivaprasad on Saturday again fired at Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X