ఎమ్మెల్యేలు , ఎంపీలను తరిమికొడతాం... శివస్వామి సంచలనం

హిందూ ధర్మం పై దాడుల విషయంలో శివ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం పై దాడులు చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివ స్వామి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మత మార్పిడి వల్ల కులాల మధ్య విభేదాలు తలెత్తుతాయి అని పేర్కొన్న శివ స్వామి జగన్ ఇప్పటికైనా మేలుకోవాలి అని డిమాండ్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ మాటలు సీఎం జగన్ వినొద్దని పేర్కొన్న శివ స్వామి ఎక్కడో ఉండి స్టేట్మెంట్ ఇవ్వడం మంచిది కాదని, ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు.

పాత దేవాలయాలకు అడ్డంకులు సృష్టించడం ఎందుకని ప్రశ్నించిన శివ స్వామి, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు అడగడానికి వస్తే తరిమికొడతాం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో ప్రభుత్వ తీరుపై అసహనం పెరిగిపోతుందని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మం పై దాడి విషయంలో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు శివ స్వామి. ప్రభుతవ నిర్లక్ష ధోరణి వల్లే హిందూ ధర్మంపై దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆయన మండిపడ్డారు.

Shivaswami sensation on MLAs and MPs over hindu dharma

గతంలో కూడా శివ స్వామి ఆలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 చోట్ల హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొంటూ శివ స్వామి కేవలం హిందూ దేవుళ్ళు విగ్రహాలే దాడులకు కనిపిస్తున్నాయి అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో యంత్రాన్ని ఉన్నా దోషులను పట్టుకోవడం లేదంటూ అనుమానాలు కలుగుతున్నాయి అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించిన ఆయన దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల శివగిరి కొండపై కృష్ణుడి విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడిన ఆయన హిందూ ధర్మం విషయంలో నిర్లక్ష్య వైఖరి మంచిది కాదన్నారు.

Recommended Video

    AP Inter Classes : APలో ఇంటర్ తరగతుల పున:ప్రారంభం పై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ స్పష్టత!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+