శోభ భార్య మాత్రమే కాదు, ఫ్రెండ్ కూడా: భూమా

ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ.. శోభ, తంగిరాల మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూమా నాగిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దివంగత శోభానాగిరెడ్డి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి అని కొనియాడారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
తంగిరాల, శోభానాగిరెడ్డి మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ పెద్ద దూరమైతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని ఆయన అన్నారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications