చివరి బంతిదాకా ఆగాలా, జగన్ సంతకం చేస్తారు: శోభా

Shobha Nagi Reddy
హైదరాబాద్: విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి వరకు పోరాడుతామని చెబుతున్నారని, ఆఖరు బంతి వరకు ఆగాల్సిన అవసరమేముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం స్పీకర్‌ను కలిశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.

అనంతరం శోభా నాగి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిడబ్ల్యూసి నిర్ణయం సమయంలో ముఖ్యమంత్రి నోరు మెదపలేదని, విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని విమర్శించారు. వారి డ్రామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.

తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎపిఎన్జీవో నేతలకు తాము ఇదే విషయాన్ని చెబుతున్నామన్నారు. ఎపిఎన్జీవోలు కోరితే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి సమైక్యాంధ్రకు అనుకూలంగా సంతకం చేస్తారన్నారు. విభజన నిర్ణయం ఓ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా తీసుకోలేదని, రాజకీయ కారణాలతోనే తీసుకున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఎంపీ మేకపాటికి స్పీకర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం కలవాలని సూచించారు.

బెయిల్ ఒప్పందం: పయ్యావుల

జగన్ ఆస్తుల కేసుపై విచారణ జరిపిన సిబిఐ అధికారి చంద్రశేఖర్ పైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని టిడిపి సీనియర్ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నరు. గతంలో అక్రమాలు జరిగాయని చెప్పిన సిబిఐనే.. ఇప్పుడు క్విడ్ ప్రోకో లేదని ఎలా చెబుతోందని ప్రశ్నించారు. హడావుడిగా జగన్ కేసుపై విచారణ పూర్తి చేయడంపై పలు రకాల అనుమానాలున్నాయన్నారు. జగన్‌తో కాంగ్రెసు పార్టీ బెయిల్ ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+