కేంద్రం చెప్తేనే గవర్నర్ చేయాలని లేదు: సెక్షన్ 8పై షాక్, సిట్‌పై రేవంత్ ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. కేంద్రం ఆదేశిస్తే గవర్నర్ సెక్షన్ 8 అమలు చేయాలని లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
సెక్షన్ 8 అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 8లో కేంద్రం పాత్ర ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది.

సెక్షన్ 8 అమలులో ఉన్నట్లేనని కేంద్రం ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేసింది. సెక్షన్ 8 అమలులోలేదని మీరు ఎలా భావిస్తారని ప్రశ్నించింది. పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 5లో ఉన్న ఉమ్మడి రాజధాని అమలు అవుతున్నప్పుడు సెక్షన్ 8 కూడా అమలులో ఉన్నట్లేనని తెలిపింది. బాధ్యత గవర్నర్‌దేనని చెప్పింది.
రేవంత్ రిమాండు గడువు పొడిగింపు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి రిమాండును ఏసీబీ న్యాయస్థానం మరోసారి పొడిగించింది. జలై 13వ తారీఖు వరకు రిమాండును పొడిగించింది.
సోమవారంతో రేవంత్ రెడ్డి రిమాండు ముగిసింది. దీంతో ఆయనను, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టారు. వీరికి ఏసీబీ న్యాయస్థానం రిమాండును పొడిగించింది. కాగా, హైకోర్టులో రేవంత్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు రావాల్సి ఉంది.
సిట్‌లో ప్రలోభ పెట్టారని రేవంత్ ఫిర్యాదు
సిట్‌లో తనను ప్రలోభ పెట్టి విచారణ జరిపారని, దీని పైన పూర్తిస్థాయి విచారణ జరపాలని రేవంత్ రెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీబీ ఇంత వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన కోరారు.
సిట్‌కు సంబంధించి ఏసీబీ కౌంటర్ వేసిందని, దాని విచారణ సమయంలో దీనిని పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం రేవంత్ రెడ్డికి సూచించింది. కేసు కీలక విచారణ దశలో ఉందని, కాబట్టి రిమాండ్ పొడిగించాలని కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయడంతో మరో 14 రోజుల పొడిగింపు జరిగింది.












Click it and Unblock the Notifications