అమెజాన్ ఇండియాకు షాక్.. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ!
దసరా, దీపావళి పండుగల సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహించింది అమెజాన్ ఇండియా. భారీ ఆఫర్లతో, అదిరిపోయే డిస్కౌంట్లతో భారీ సేల్ ఫెస్టివల్ ని నిర్వహించింది. పండుగ సమయాలలో బిజినెస్ లో దూసుకుపోయే అమెజాన్ ఇండియాకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.
అమెజాన్ లో ఆన్ లైన్ షాపింగ్ చేసిన వారికి షాక్
amazon ను నమ్ముకొని అనేక ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసిన వారు తాము ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్, కంపెనీ పంపిన ప్రొడక్ట్స్ కి మధ్య వ్యత్యాసం ఉండడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తాము ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు చీప్ క్వాలిటీ వస్తువులు రావడంతో చాలామంది లబోదిబోమన్నారు. రిటర్న్ పెడితే కూడా తీసుకువెళ్ళని ప్రొడక్ట్స్ తో కన్స్యూమర్స్ ఇబ్బంది పడ్డారు.

ఐ ఫోన్ కొంటె ఐక్యూ ఫోన్ డెలివరీ
కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించడంతో ఆన్లైన్ ప్లాట్ ఫామ్ దిగ్గజమైన అమెజాన్ కు ఊహించని షాక్ తగిలింది. వీరేష్ అనే వ్యక్తి amazon షాపింగ్ ప్లాట్ ఫామ్ లో 80 వేల రూపాయలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసాడు అయితే అతనికి ఐఫోన్ 15 ప్లస్ స్థానంలో ఐక్యూ ఫోన్ ను డెలివరీ చేశారు.
కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించిన బాధితుడు
కంగుతిన్న అతను అనేకమార్లు కస్టమర్ కేర్ కి కాల్ చేసి మాట్లాడినప్పటికీ, అమెజాన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆయన కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. ఇక వీరేష్ ఫిర్యాదు పైన విచారణ జరిపిన కన్స్యూమర్ ఫోరం అమెజాన్ సంస్థ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అమెజాన్ కు కీలక ఆదేశం, నాన్ బెయిలబుల్ వారెంట్
కన్స్యూమర్ ఫోరం వెంటనే బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయాలని, లేనిపక్షంలో 80 వేల రూపాయలను రిఫండ్ చేస్తూ అదనంగా 25 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని అమెజాన్ కు ఆదేశాలు ఇచ్చింది. అయితే అమెజాన్ ఇండియా కన్స్యూమర్ ఫోరం ఆదేశాలను పట్టించుకోలేదు దీంతో ఆగ్రహించిన కన్స్యూమర్ ఫోరం అమెజాన్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications