మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్.. పోలీస్ కేసు నమోదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో వైసిపి నేతల పైన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో టిడిపి, జనసేన నేతల పైన వైసీపీ సోషల్ మీడియా సభ్యులు గతంలో పెట్టిన అనుచిత పోస్టులపైన వరుసగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లకు చేరుతుండగా పోలీసులు కేసులు నమోదు చేసి వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు.

టీడీపీ, జనసేన సోషల్ మీడియాపై అంబటి రాంబాబు ఫిర్యాదు
ఇక ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పట్టాభిపురం పోలీసులు షాక్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి అత్యుత్సాహం ప్రదర్శించిన మంత్రిపై కేసు నమోదు చేశారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తెలుగుదేశం మరియు జనసేన సోషల్ మీడియా ఖాతాల పైన ఫిర్యాదు చేశారు.

Shock for former minister Ambati Rambabu police case registered on him

పోలీసులతో వాగ్వాదం, మెట్లపై కూర్చుని నిరసన
అంతటితో ఊరుకోక తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ మెట్ల పైనే అనుచరులతో బైఠాయించి చేతిలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు
దీంతో పోలీసులు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాలని అంబటి రాంబాబు పైన పట్టాభిపురం పోలీసులు నేడు కేసు నమోదు చేశారు. టిడిపి జనసేన సోషల్ మీడియా పైన కేసులు పెట్టించాలని వెళ్లిన అంబటి రాంబాబు ఆయన చేసిన చర్యతో ఆయనే కేసులో ఇరుక్కున్నాడు.

అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ప్రస్తుత ఈ వార్త వైరల్ కాగా పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు ధర్నాకు దిగిన వీడియోను షేర్ చేసిన టిడిపి జనసేన కార్యకర్తలు ఎరక్కపోయి ఇరుక్కుపోయిన మాజీ మంత్రి అంటూ ఆయనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి అంటూ అంబటి రాంబాబుని ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+