వైఎస్ భారతికి షాక్.. ఆ వీడియోతో టీడీపీ సంచలన పోస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా, ప్రత్యర్థి పార్టీలు దానినే టార్గెట్ చేస్తున్నాయి. ఇక తాజాగా పులివెందుల నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ కోసం ఆయన సతీమణి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆమెను ఒక గ్రామస్తుడు నిలదీసిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ టార్గెట్ చేసింది.
వైఎస్ భారతి పై టీడీపీ పోస్ట్
ఇక టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో భారతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, స్థానికులు ఆమెను ప్రశ్నిస్తున్నారని, అడుగడుగునా భారతికి చేదు అనుభవం ఎదురు అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. ఈ క్రమంలో భారతిని ఒక స్థానికుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేకపోయారని కూడా పోస్ట్ చేసింది.

జగన్ సతీమణి భారతిని నిలదీసిన వైసీపీ నేత
ఇక ఇదే విషయాన్ని వెల్లడించిన టీడీపీ మా భూమిపై మీ భర్త ఫోటో ఏంటమ్మా! భారతీ.. అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వైసీపీనేత సుబ్బారెడ్డి వైఎస్ జగన్ సతీమణి భారతిని నిలదీశారని ఆ పోస్టులో పేర్కొంది. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీనేతే ఆస్తిపత్రాలపై జగన్ బొమ్మలు ఎందుకు అంటూ ప్రశ్నించేసరికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి భారతీరెడ్డి జారుకున్నారని పోస్ట్ చేసింది.
మా భూమిపై మీ భర్త ఫోటో ఏంటమ్మా! భారతీ.. అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వైకాపా నేత సుబ్బారెడ్డి నిలదీశారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతే ఆస్తిపత్రాలపై జగన్ బొమ్మలు ఎందుకు అంటూ ప్రశ్నించేసరికి సమాధానం చెప్పలేక అక్క… pic.twitter.com/H8V4IqAjO6
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2024
ఆ వీడియో పోస్ట్ చేసి భారతి టార్గెట్
టీడీపీ తన పోస్టులో భారతితో వైసీపీనేత సుబ్బారెడ్డి ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మలెందుకు అని ప్రశ్నిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా, ఒక పక్కా ప్లాన్ తో టీడీపీ టార్గెట్ చేస్తుంది. వైఎస్ భారతి పులివెందులలో జగన్ కోసం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతి ప్రచారానికి జనం నుండి కూడా మంచి స్పందన వస్తుంది.
సోషల్ మీడియాలో భారతి టార్గెట్
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారతి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆమెకు ప్రజల నుండి షాకింగ్ ప్రశ్నలు వస్తున్నాయని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. సోషల్ మీడియా వేదికగా భారతిని రచ్చ మొదలెట్టింది టీడీపీ.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications