సామాన్యులకు షాక్.. కొండ దిగనంటున్న కోడిగుడ్డు ధరలు!

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరలిట్టా మండబట్టే.. అంటూ సామాన్యులు బాధపడే రోజులు పోవడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో విపరీతంగా పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు కూడా సామాన్యుడికి ఏమీ తినలేని పరిస్థితిని తెస్తున్నాయి.

షాకిచ్చేలా పెరిగిన కోడిగుడ్డు ధరలు
రోజు రోజుకు కోడి గుడ్డు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు కూరగాయల ధరలు, మరోవైపు కోడిగుడ్ల ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కోడి గుడ్డు ధర 5 రూపాయల 90 పైసలుగా నెక్ నిర్ణయించింది. ఇక రిటైల్ మార్కెట్లో ఆరు రూపాయల 50 పైసల నుంచి ఏడు రూపాయల వరకు కోడి గుడ్డు ధర పలుకుతుంది.

shock to common people eggs prices soaring in telugu states

గుడ్ల ధరలు పెరగటానికి కారణం ఇవే
దీంతో ప్రస్తుతం ప్రజలు కోడిగుడ్లు కొనాలంటే భయపడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో కోడిగుడ్ల వినియోగం పెరగడం కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలు మాత్రమే కాకుండా క్రిస్మస్, నూతన సంవత్సర సందర్భంగా కేకుల తయారీకి గుడ్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న క్రమంలోను కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందని వ్యాపార వర్గాల భావిస్తున్నాయి.

ప్రస్తుతం గుడ్డు ధర ఇలా
అంతేకాదు కోళ్ల దాణా రేటు, రవాణా ఖర్చులు సైతం వీటి ధరలను ప్రభావితం చేస్తున్నాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నెలలో కోడి గుడ్డు ధర ఏడు రూపాయలు పలకగా, ఆ తర్వాత కొద్ది కొద్దిగా క్షీణించి మే నెల వరకు ఐదు రూపాయల నుంచి 5.50 పైసల వరకు గుడ్డు ధర చేరింది. మళ్లీ ఇప్పుడు క్రమంగా పెరుగుతూ గుడ్డు ధర ఏడు రూపాయలకు చేరింది.

అడపా దడపా కూడా సామాన్యులు గుడ్డు తినే పరిస్థితి లేనట్టే
ప్రస్తుతం ఒక డజన్ గుడ్లు కొనాలంటే సామాన్యులు 84 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేసినా ప్రతిరోజు కాదు.. అడపాదడప గుడ్డు తినాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. విపరీతంగా పెరుగుతున్న కోడిగుడ్ల ధరలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుండు అన్న అభిప్రాయం సామాన్య, మధ్యతరగతి ప్రజలలో వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+