మావోయిస్టులకు షాక్ .. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితో పాటు ఐదుగురు లొంగుబాటు; ఏపీ డీజీపీ ఏం చెప్పారంటే!!
గత కొంత కాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కూడా పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. విశాఖ ఏజెన్సీలో అణువణువున కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులకు చెక్ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో తాజాగా ఏవోబీ బోర్డర్లో ఆరుగురు మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చెయ్యటం, ఆపై వారు సరెండర్ అయ్యినట్టు ప్రకటించటం మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి.

గిరిజన ప్రాంతాల్లో మావోయిస్ట్ లకు ఆదరణ కరువు : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. మావోయిస్టులకు గిరిజనుల నుండి ఆదరణ కరువైందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని వెల్లడించారు. అందుకే గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మావోయిస్టు భావజాలం వైపు మళ్లడం లేదని, వారిని ఆదరించడం లేదని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గాజర్ల రవి అలియాస్ ఉదయ్ సహా మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన ట్లుగా ఆయన వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్ట్ ల వివరాలు వెల్లడించిన డీజీపీ
గిరిజనులకు మూడు లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, 19,919 కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిందని,గిరిజన ప్రాంతాలలో గతంలో ఉన్న భూ సమస్యలు కూడా ఇప్పుడు లేవని ఆయన వెల్లడించారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్ జోనల్ కమాండర్ చెప్పిన వివరాల కారణంగా మిగతా వారి వివరాలు తెలిశాయి అని పేర్కొన్న డిజిపి, ఏవోబీ సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయినట్లుగా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయిన వారిలో ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, ముగ్గురు ఇతర మెంబర్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇటీవల మావోలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు ఘటన జరిగింది. ఈ ఘటనలో అగ్రనేతలు అరుణ, గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతల కదలికలు ఉన్నాయని పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి దారకొండ పంచాయతీ పరిధిలో పెద్దపల్లి తడక బంద అటవీ ప్రాంతంలో గత నెలలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

మావోలకు అడుగడుగునా ఇబ్బందులు .. కరోనాతోనూ దెబ్బ
ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ తప్పించుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఉండటం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇటీవల వరుసగా మావోయిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దండకారణ్యంలోనూ కరోనా మహమ్మారి విజృంభించడంతో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు కరోనా మహమ్మారికి బలైపోయారు. హిడ్మా వంటి కీలక నేతలు కూడా కరోనా బారిన పడ్డట్టుగా వార్తలు వచ్చాయి.

అటవీ ప్రాంతాల్లో జోరుగా కూంబింగ్ ... లొంగిపోతున్న మావోలు
అటవీ ప్రాంతాలలో కరోనా బారిన పడిన మావోయిస్టులను పట్టించుకునే నాథుడు లేడని వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు లొంగిపోతే వైద్యం చేయిస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఇదే అదునుగా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు లొంగిపోయేలా చేశారు. తాజా పరిణామాలు తమ ఉనికి చాటాలని ప్రయత్నం చేస్తున్న మావోయిస్ట్ పార్టీని బలహీనం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications